logo

RFC: ‘హైదరాబాద్‌ వచ్చిన వారు రామోజీ ఫిల్మ్‌ సిటీ చూసే వెళ్తారు’

మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సరళతరమైన పారిశ్రామిక విధానాల కారణంగా హైదరాబాద్‌ లాంటి అనేక నగరాల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య సంస్థలు అడుగుపెడుతున్నాయని ఉత్తరాఖండ్‌ సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునిత్‌ పేర్కొన్నారు.

Updated : 28 Nov 2022 07:19 IST

ఉత్తరాఖండ్‌ సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సరళతరమైన పారిశ్రామిక విధానాల కారణంగా హైదరాబాద్‌ లాంటి అనేక నగరాల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య సంస్థలు అడుగుపెడుతున్నాయని ఉత్తరాఖండ్‌ సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆదివారం జరిగిన శ్రీను టెక్నాలజీ మొదటి వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు కొత్తగా వచ్చిన వారు రామోజీ ఫిల్మ్‌ సిటీని చూసెళ్తారని, అంతటి అద్భుతంగా ఫిల్మ్‌ సిటీని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఏపీ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి ఏఆర్‌ సుకుమార్‌, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.ఎం.కోదండరామ్‌, అపోలో ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్‌ అడ్వైజర్‌, గాంధీ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్‌ డా.మోహనకృష్ణ, ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ సదాశివరెడ్డి, వ్యాపారవేత్త కేఈ హరిబాబు, శ్రీను టెక్నాలజీ ఎండీ చిల్కా కావ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు