తల్లిదండ్రులకు భారమై.. తిరిగిరాని లోకాలకు తరలిన ‘ఆకాంక్ష’
ముక్కుపచ్చలారని ప్రాయం.. మానసిక సమస్యలతో సతమతం.. తల్లిదండ్రులకు భారంగా భావించడం.. ఆకాంక్ష ఆయువును తీశాయి.
శిశు విహార్‌లో ఆశ్రయం పొందుతున్న బాలిక మృతి
అమీర్‌పేట, న్యూస్‌టుడే: ముక్కుపచ్చలారని ప్రాయం.. మానసిక సమస్యలతో సతమతం.. తల్లిదండ్రులకు భారంగా భావించడం.. ఆకాంక్ష ఆయువును తీశాయి. మూడేళ్ల వయసున్న బాలికను కాపాడేందుకు శిశువిహార్ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కన్నవారు కాదనుకోగా, తిరిగిరాని లోకాలకు చిన్నారి తరలివెళ్లింది. ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్ఐ సందీప్ నాయుడు తెలిపారు. స్వల్ప మానసిక సమస్యలతో జన్మించిన ఆకాంక్ష(ఆశ్రయం కల్పించిన అధికారులు పెట్టిన పేరు)ను మూడేళ్ల వయసు వచ్చాక.. ఈ ఏడాది అక్టోబరు 23న ఆమె తల్లిదండ్రులు మెదక్ చర్చివద్ద వదిలివెళ్లారు. స్థానికుల సమాచారంతో.. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యుసీ) సిబ్బంది గుర్తించి మెదక్‌లోని బాలసదన్‌లో ఆశ్రయం కల్పించారు. చిన్నారి అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఈనెల 16న యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోం శిశువిహార్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమించడంతో 18న నిలోఫర్‌కు తరలించారు. చికిత్స అనంతరం శిశువిహార్‌కు చేరిన ఆమె పరిస్థితి మళ్లీ విషమించడంతో.. 26న మళ్లీ నిలోఫర్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు ధ్రువీకరించిన ఆసుపత్రి వైద్య సిబ్బంది తెలిపారు. శిశువిహార్ ఇన్‌ఛార్జి సంతోషిబాయి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!
-
Sports News
IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
-
Technology News
WhatsApp: మూడు ఆప్షన్లతో వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్!
-
Politics News
Jairam Ramesh: భారత్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ: కాంగ్రెస్
-
General News
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల