logo

‘సింధు.. బిందు’.. నృత్య విందు

చక్కని హావభావాలతో యువ నర్తకీమణులు ‘సింధు, బిందు’ల నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మెప్పించింది.

Published : 28 Nov 2022 02:02 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: చక్కని హావభావాలతో యువ నర్తకీమణులు ‘సింధు, బిందు’ల నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మెప్పించింది. ‘దీపాంజలి’ స్కూల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సీ ఇన్‌ కూచిపూడి వ్యవస్థాపక డైరెక్టర్‌, తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్‌, నాట్యగురువు దీపికారెడ్డి పర్యవేక్షణలో సోదరీమణులు ఆదివారం రాత్రి రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య అరంగేట్రం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్‌, సినీ సంగీత దర్శకుడు దేవిప్రసాద్‌, సినీ దర్శకులు సుకుమార్‌, బుచ్చిబాబు, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ, శాంతాబయోటెక్నిక్స్‌ అధినేత డా.కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి, కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కార గ్రహీత దరూరి రాఘవాచారి, నర్తకీమణుల తల్లిదండ్రులు ఇందిర, దొరబాబు పాల్గొన్నారు. ప్రదర్శన అనంతరం నర్తకీమణులు తమ గురువు సత్కరించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు