logo

కుతుబ్‌షాహీ మెట్ల బావికి అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌

కుతుబ్‌షాహీ మెట్ల బావికి ‘అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌’ ప్రకటించడం పట్ల డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ హర్షం వ్యక్తం చేసింది. బ్యాంకాక్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో యునెస్కో ఆసియా-పసిఫిక్‌ అవార్డ్స్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ ఈ అవార్డును ప్రకటించింది.

Updated : 28 Nov 2022 05:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: కుతుబ్‌షాహీ మెట్ల బావికి ‘అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌’ ప్రకటించడం పట్ల డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ హర్షం వ్యక్తం చేసింది. బ్యాంకాక్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో యునెస్కో ఆసియా-పసిఫిక్‌ అవార్డ్స్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ ఈ అవార్డును ప్రకటించింది. ఒకప్పుడు తాగునీటి వనరుగా పనిచేసి శిథిలావస్థలో నిరుపయోగంగా ఉన్న మెట్లబావుల సంరక్షణ, పునరుద్ధరణను పురపాలక శాఖ చేపట్టింది. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, ఆఘాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌(ఏకేటీసీ)లకు డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ఛైర్మన్‌ మణికొండ వేదకుమార్‌ అభినందనలు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని