చిన్నారుల ఆరోగ్యం.. సాంకేతిక సహకారం
చిన్నారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేపట్టారు.
అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులు
న్యూస్‌టుడే, బొంరాస్‌పేట, కొడంగల్ గ్రామీణం, వికారాబాద్: చిన్నారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేపట్టారు. మహిళా, శిశుసంక్షేమశాఖలో కొనసాగుతున్న అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయటానికి ‘న్యూట్రీషియన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం’ (ఎన్‌హెచ్‌టీఎస్) యాప్‌కు శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొదటగా ఎంపిక చేసిన అంగన్వాడీ ఉపాధ్యాయులు, పర్యవేక్షకులకు దశల వారీగా శిక్షణ ఇస్తున్నారు. తద్వారా కాగిత రహిత కార్యకలాపాలు జరగనున్నాయి.
జిల్లాలోని 20 మండలాల్లో ఐదు అంగన్వాడీ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వాటి పరిధిలో 1,106 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 32,769 మంది ఉండగా మూడు నుంచి ఆరేళ్లలోపు 21,458 మంది ఉన్నారు. కేంద్రాలకు వచ్చే మూడేళ్లు దాటిన వారికి పూర్వ, ప్రాథమిక విద్యతో పాటుగా పౌష్టికాహారం అందిస్తున్నారు.
యాప్‌లో వివరాలు నమోదు
జిల్లాలో నవంబరు నుంచి ఎన్హెచ్టీఎస్కు అనుబంధంగా ప్రత్యేక పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమం (సూపర్వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం) అమలు చేస్తున్నారు. తీవ్ర పోషకలోపంతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. యాప్‌లో అంగన్వాడీల విధులు, కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. చిన్నారుల ఎదుగుదల పర్యవేక్షణ, ఆహార నిల్వలు, గర్భిణుల వివరాలు, టీకాల పంపిణీ, పర్యవేక్షణ అంశాలు ఉపాధ్యాయులు నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. యాప్ అమలు చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ ఉపాధ్యాయినులు, పర్యవేక్షకులకు శిక్షణ ఇచ్చారు. వీరంతా ఆయా ప్రాజెక్టుల వారీగా మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు నాటికి యాప్‌ను ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారు.
కాగిత రహిత సేవలు అందించనున్నాం..
లలితకుమారి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారిణి
అంగన్వాడీ కేంద్రాల్లో కాగితరహిత కార్యకలాపాలు నిర్వహించనున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తూ, చరవాణులు అందించాం. ఆయా ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఉన్న నెట్‌వర్క్‌లకు అనుగుణంగా సిమ్‌కార్డులను అందించాం. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ల్లో ప్రతి నిత్యం వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!
-
Sports News
IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
-
Technology News
WhatsApp: మూడు ఆప్షన్లతో వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్!
-
Politics News
Jairam Ramesh: భారత్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ: కాంగ్రెస్