ప్రోత్సాహకం అందక.. పాడి రైతుల నిరాశ
పాడి పరిశ్రమతో ఉపాధి పొందాలనుకున్న రైతులకు నిరాశ తప్పడం లేదు. తరచూ పాల సేకరణ ధరను పెంచుతున్నప్పటికీ సర్కారు నుంచి అందాల్సిన ప్రోత్సాహకం సకాలంలో విడుదల కావడం లేదు.
బకాయిల విడుదలతోనే మేలు
పరిగిలోని పాలశీతలీకరణ కేంద్రం
న్యూస్‌టుడే, పరిగి: పాడి పరిశ్రమతో ఉపాధి పొందాలనుకున్న రైతులకు నిరాశ తప్పడం లేదు. తరచూ పాల సేకరణ ధరను పెంచుతున్నప్పటికీ సర్కారు నుంచి అందాల్సిన ప్రోత్సాహకం సకాలంలో విడుదల కావడం లేదు. దీంతో అన్నదాతలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ప్రధానంగా దాణా ధరలు విపరీతంగా పెరగడంతో పాడి పరిశ్రమ నిర్వహణ భారంగా మారుతోందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పరిగి నియోజకవర్గాన్ని వ్యవసాయాధారిత ప్రాంతంగా గుర్తించి 1972లో పరిగిలో పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు 20వేల లీటర్ల పాలను రాష్ట్ర రాజధానికి అందించిన ఘన చరిత్ర ఉంది. అనేక కారణాలతో క్రమక్రమంగా నిర్వీర్యంగా మారుతోంది. ఉత్పత్తిదారులకు ఆర్థిక చేయూతనిచ్చి పాల దిగుబడిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబరు నుంచి లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అప్పుడప్పుడు నిధులు విడుదలవుతున్నా సకాలంలో అందడం లేదు.
రావాల్సినవి రూ.30 లక్షలు
జిల్లాలో నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) ఆధ్వర్యంలో రెండు పాలశీతలీకరణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి పరిధిలో నాలుగు రూట్ల ద్వారా 18 ఉప సేకరణ కేంద్రాలున్నాయి. 800 మంది రైతుల నుంచి రోజుకు సుమారు 2500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. గతేడాది జూన్ నుంచి బకాయిలు విడుదల కావాల్సి ఉన్నాయి. ఈ లెక్కన సుమారు రూ.30లక్షల వరకు ప్రోత్సాహక నిధులు రావాల్సి ఉంది. సకాలంలో మంజూరైతే పశు దాణాతో పాటు గడ్డి విత్తనాలు, ఇతరత్రా కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
రాయితీలు ఇస్తే..
వేసవిని దృష్టిలో ఉంచుకుని మదర్ డెయిరీ అధికారులు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికను రూపొందించాలని పలువురు కోరుతున్నారు. పాల కొరతను అధిగమించేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టాలని ప్రతికూల పరిస్థితులతో కొందరు పరిశ్రమను వదులుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ముడి సరకు ధరలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రాయితీలు ప్రకటించాలని కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!