తాండూరుకు నిధుల వరద
తాండూరు నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.134.50 కోట్లు మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీటిని వినియోగించనున్నారు.
న్యూస్‌టుడే, తాండూరు: తాండూరు నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.134.50 కోట్లు మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీటిని వినియోగించనున్నారు. తద్వారా గ్రామాలు, తాండూరు మున్సిపాలిటీలో మౌలిక వసతులు సమకూరనున్నాయి. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించిన మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, కరణ్కోటతో పాటు మరో 144 గ్రామాలకు రూ.78 కోట్లు కేటాయించారు. ఇందులో మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున ఇచ్చారు. కరణ్కోటకు రూ.కోటి కేటాయించారు. నియోజకవర్గంలోని 144 గ్రామాలకు రూ.51 లక్షల చొప్పున మొత్తం రూ.74 కోట్లు మంజూరయ్యాయి. బషీరాబాద్ మండల కేంద్రంలో రహదారులు, మురుగు కాల్వల నిర్మాణానికి ప్రత్యేకంగా రూ.3కోట్లు ఇచ్చారు.
పట్టణంలో సమస్యలు తీరేలా..
పురపాలికలోని 36 వార్డులకు రూ.36 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో వార్డుకు రూ.కోటి చొప్పున వ్యయం చేయనున్నారు. రోడ్లు, మురుగు కాల్వలతోపాటు ఇతర పనులు చేపట్టనున్నారు. కౌన్సిలర్లకు తాజా పరిస్థితి ఊరట నిచ్చింది. అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు లేక నిత్యం అవస్థలు పడుతున్న ఎన్టీఆర్ కాలనీ, మార్కాండేయ నగర్, మిత్రానగర్, గ్రీన్‌సిటీ, ఆదర్శ, తులసీనగర్, భవానీనగర్, సాయిపూరు, విశ్వంభర కాలనీ, పాత తాండూరు, గాంధీనగర్, ఇందిరానగర్ తదితర కాలనీల్లోని సమస్యలు తీరనున్నాయి.
మార్కెట్ కమిటీ భవనానికి
తాండూరులో వ్యవసాయ విపణి విస్తరణకు ప్రభుత్వం ఇప్పటికే 30 ఎకరాల భూమిని కేటాయించింది. ఇదే స్థలంలో అన్ని హంగులతో కూడిన భవనాన్ని రూ.10 కోట్లతో నిర్మించనున్నారు. ఇది పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తుల క్రయ,విక్రయాలకు ఇబ్బందులు తీరనున్నాయి. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బీసీ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. బంజారా భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరయ్యాయి. ప్రభుత్వ ఐటీఐ, డిగ్రీ కళాశాలల అభివృద్ధికి రూ.4.50 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.3 కోట్లను ఐటీఐ కళాశాలలో వసతుల కల్పనకు వినియోగించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
-
Technology News
WhatsApp: మూడు ఆప్షన్లతో వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్!
-
Politics News
Jairam Ramesh: భారత్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ: కాంగ్రెస్
-
General News
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల
-
India News
Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి
-
Politics News
Eknath Shinde: ‘2024లో ఎన్డీయేదే పవర్.. మోదీ అన్ని రికార్డులూ బ్రేక్ చేస్తారు’