సంక్షిప్త వార్తలు
సికింద్రాబాద్ రూబీ లగ్జరీ ప్రైడ్ లాడ్జిలో అగ్నిప్రమాదంపై న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేసేందుకు పోలీసులు కసరత్తు ముమ్మరం చేశారు.
రూబీ అగ్నిప్రమాదంపై త్వరలో ఛార్జిషీట్
ఈనాడు, హైదరాబాద్; రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: సికింద్రాబాద్ రూబీ లగ్జరీ ప్రైడ్ లాడ్జిలో అగ్నిప్రమాదంపై న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేసేందుకు పోలీసులు కసరత్తు ముమ్మరం చేశారు. మరో 10-20 రోజుల్లో దాఖలు చేయాలని భావిస్తున్నారు. సెప్టెంబరు 12 అర్ధరాత్రి రూబీ లాడ్జిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మృత్యువాతపడ్డారు. కేసు నమోదు చేసిన మోండా మార్కెట్ పోలీసులు లాడ్జి యజమానులతో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనం ఓవర్ ఛార్జింగ్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు, కార్బన్ మోనాక్సైడ్, లిథియం విషవాయువులతో మృతుల సంఖ్య పెరిగినట్టు నిర్ధారించారు.
జాప్యానికి కారణాలివేనా?
సంచలనం రేపిన ఈ ఘటనపై పలు విభాగాలు స్పందించాయి. కేసులో అరెస్టయిన నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారు. అగ్నిప్రమాదానికి దారితీసిన అంశాలను శాస్త్రీయంగా నిరూపించేందుకు ఆధారాల సేకరణ చేపట్టారు. ఎలక్ట్రికల్ వాహనాల డీలర్ షిప్ ఇచ్చిన సంబంధిత కంపెనీకి లేఖ రాశారు. రూబీ లాడ్జికి ఏ నిబంధన ప్రకారం అనుమతులిచ్చారు.. తదితర అంశాలపై నివేదిక కావాలంటూ 40 రోజుల క్రితమే జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. 3-4 సార్లు సంప్రదించినా పని ఒత్తిడిలో ఉన్నామంటూ వారు జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. 9కిగాను 6 మాత్రమే అందాయని, మరో 2-3 శాఖల నివేదికలకు ఎదురుచూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అవి అందితే 10-20 రోజుల్లో న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
డ్రగ్ డాన్ బాలమురుగన్ కస్టడీకి నేడు పిటిషన్
రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: గోవా కేంద్రంగా మత్తు దందా నిర్వహిస్తున్న డ్రగ్ డాన్ బాలమురుగన్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు సోమవారం రాంగోపాల్‌పేట్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. డ్రగ్ కింగ్‌పిన్ ఎడ్విన్ న్యూన్స్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలున్నాయి. దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని కొకైన్, హెరాయిన్ వంటి సింథటిక్ డ్రగ్స్ చేరవేస్తున్నాడు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు ఇటీవల ఇతన్ని అరెస్ట్ చేయగా, కొద్దిరోజుల కిందట బెయిల్‌పై బయటకు వచ్చాడు. వివిధ ఠాణాల్లో సంతకాలు చేసేందుకు నగరంలోనే ఉంటున్నాడు. ఇతనిచ్చిన సమాచారంతో బాలమురుగన్‌ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. అతని సెల్‌ఫోన్‌లోని కాల్‌డేటా, ఏజెంట్లతో సాగించిన ఛాటింగ్ వివరాలను సేకరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కస్టడీకి తీసుకొని మరింత సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు.
అంబులెన్స్‌లో ప్రసవించిన బాలిక
అమీర్‌పేట, న్యూస్‌టుడే: నిండు గర్భిణి అయిన బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే శిశువుకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. పోక్సో కేసులో బాధితురాలు, బిహార్ రాష్ట్రానికి చెందిన బాలిక(15) యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోంలో కొంతకాలంగా ఆశ్రయం పొందుతోంది. ఆమెకు ఆదివారం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. దీంతో అమీర్‌పేట నుంచి స్టేట్‌హోంకు చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది.. అనంతరం బాలికను గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది అయిన ఈఎంటీ వెంకటేష్, పైలెట్ కె.శ్రీధర్‌లు బాలికకు ప్రసవం చేశారు. ఆమెకు ఆడబిడ్డ జన్మించడంతో తల్లీ బిడ్డలిద్దరినీ తదుపరి చికిత్సల నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు.
పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు కృషి: మంత్రి
బాగ్‌లింగంపల్లి: పత్రికా స్వేచ్ఛ, మీడియా పరిరక్షణకు చర్యలు చేపడతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ద్వితీయ రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్, కాంగెస్ నేత వీహెచ్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులు ప్రదర్శన నిర్వహించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Supeme Court: అహోబిలం మఠం కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురు దెబ్బ
-
Politics News
Maharashtra: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్..?
-
General News
JEE Main 2023: జేఈఈ మెయిన్ JAN 28- 30 అడ్మిట్ కార్డులొచ్చేశాయ్.. డౌన్లోడ్ చేసుకోండిలా!
-
Movies News
Rajinikanth: మద్యానికి బానిసైన నన్ను ఆమె ఎంతో మార్చింది..: రజనీకాంత్
-
India News
Cheetahs: మళ్లీ ఎగిరొస్తున్న చీతాలు.. ఈసారి ఎక్కడినుంచంటే..?
-
Movies News
Jamuna: ఏడాదిపాటు మాట్లాడుకోని సావిత్రి - జమున