Hyderabad: బొట్టు బిళ్లలు, వత్తుల పేరుతో భారీ మోసం.. రూ.200 కోట్లకు టోకరా!

నగరంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.200కోట్లకు టోకరా వేశారు. 

Updated : 28 Nov 2022 14:36 IST

హైదరాబాద్‌: నగరంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో ఓ వ్యక్తి సుమారు రూ.200కోట్లకు టోకరా వేశారు. ఈ వ్యవహారంలో సుమారు 1100 మంది మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఏఎస్‌రావునగర్‌ పరిధిలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. ఏఎస్‌రావునగర్‌లో రావులకొల్లు రమేశ్‌ అనే వ్యక్తి ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో సంస్థను స్థాపించాడు. దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీకి యంత్రాలను ఆయన విక్రయించాడు. దీపం వత్తుల మెషిన్‌ రూ.1.70లక్షలు, బొట్టు బిళ్లల యంత్రం రూ.1.40లక్షల చొప్పున వినియోగదారులకు విక్రయించాడు. తాను ఇచ్చే ముడిసరకుతో వత్తులు, బొట్టు బిళ్లలు తయారు చేస్తే కిలోల చొప్పున డబ్బు చెల్లిస్తానని వారిని నమ్మబలికాడు. 

కిలో బొట్టు బిళ్లలకు రూ.600, వత్తులకు రూ.300 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొంతమంది తమ స్నేహితులకు కూడా యంత్రాలను ఇప్పించారు. మరికొందరు యూట్యూబ్‌లో చూసి రమేశ్‌ వద్ద యంత్రాలు కొనుగోలు చేశారు. 2021 నుంచి వాటిని విక్రయిస్తున్న రమేశ్‌.. ఇటీవల బోర్డు తిప్పేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితులు.. లబోదిబోమంటూ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని