logo

జిల్లాల ఆటోలను నగరంలో అనుమతించాలి

ఇతర జిల్లాల్లో రిజిస్టర్‌ అయిన ఆటోలనూ నగరంలో అనుమతించాలని పలువురు ఆటోడ్రైవర్లు డిమాండ్‌ చేశారు.

Published : 29 Nov 2022 04:37 IST

ఆటోడ్రైవర్లను అరెస్టు చేస్తున్న పోలీసులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఇతర జిల్లాల్లో రిజిస్టర్‌ అయిన ఆటోలనూ నగరంలో అనుమతించాలని పలువురు ఆటోడ్రైవర్లు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వివిధ జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ ఉన్న ఆటోల డ్రైవర్లు సోమవారం నాంపల్లిలోని నగర ట్రాఫిక్‌ సంయుక్త కమిషనర్‌ రంగనాథ్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. 40కిపైగా ఆటోలను రోడ్లపై నిలిపి నినాదాలతో హోరెత్తించారు. దీంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ కె.సత్తయ్య సిబ్బందితో కలిసి ఆటోడ్రైవర్లను అరెస్టు చేశారు. చివరకు ఐదుగురు ఆటోడ్రైవర్ల నాయకులతో కూడిన బృందాన్ని సైఫాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ వద్దకు చర్చలకు తీసుకెళ్లారు. ఇది వరకు ఉన్నట్లుగా కేవలం రంగారెడ్డి, హైదరాబాద్‌లో రిజిస్టర్‌ అయిన ఆటోలకు మాత్రమే అనుమతి ఉందని ఆయన చెప్పినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని