logo

అన్ని రంగాల్లోనూ మహిళల రాణింపు అభినందనీయం

మహిళలు అన్నిరంగాల్లో రాణించడం సంతోషకరమని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు.

Published : 29 Nov 2022 04:37 IST

విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు జ్ఞాపిక అందజేస్తున్న మహ్మద్‌ వలీయుల్లా, జాఫర్‌ జావేద్‌ తదితరులు

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: మహిళలు అన్నిరంగాల్లో రాణించడం సంతోషకరమని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. బంజారాహిల్స్‌లోని సుల్తాన్‌ ఉల్‌ ఉలూమ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ(ఎస్‌యూఈఎస్‌) అనుబంధ అంజాద్‌ అలీఖాన్‌ ఎంబీఏ కళాశాలలో ఓరియెంటేషన్‌ డే వేడుకలు సోమవారం జరిగాయి. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ.. వృత్తివిద్యలో అమ్మాయిల ముందంజ మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు. ఎస్‌యూఈఎస్‌ ఛైర్మన్‌ మహ్మద్‌ వలీయుల్లా, గౌరవకార్యదర్శి జాఫర్‌ జావేద్‌ కరుణను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కళాశాల ప్రతినిధులు మసూద్‌ అబ్దుల్‌ ఖాదర్‌, అమేర్‌ జావేద్‌, ఎంబీఏ కళాశాల డైరెక్టర్‌ ఆచార్య షెహబాజ్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని