logo

అందుబాటులో తారు రోడ్డు.. అవస్థలకు సెలవు

అధ్వానంగా ఉన్న రహదారి రాకపోకలకు సౌకర్యంగా మారింది. తాజా పరిస్థితితో గడచిన మూడేళ్లకు పైగా ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఊరట లభించినట్లయ్యింది.

Published : 29 Nov 2022 04:50 IST

పరిగి, న్యూస్‌టుడే: అధ్వానంగా ఉన్న రహదారి రాకపోకలకు సౌకర్యంగా మారింది. తాజా పరిస్థితితో గడచిన మూడేళ్లకు పైగా ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఊరట లభించినట్లయ్యింది. తాండూరు పట్టణంలో డీఎస్పీ కార్యాలయం నుంచి పాత తాండూరు రైల్వే గేటు వరకు 280 మీటర్ల పొడవున్న రోడ్డు మూడేళ్ల నుంచి అధ్వానంగా మారింది. తారు, కంకర తొలగి పోయి వాహనదారులు రాకపోకల సమయంలో అవస్థలు పడుతున్నారు. పాత తాండూరు వాసులు తాండూరు పట్టణంలోకి వచ్చి పోవడానికి ప్రధాన రహదారి. నియోజక వర్గంలోని వివిధ] ప్రాంతాలకు చెందిన వారు ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాలన్నా ఇదే రహదారిపై రాకపోకలు సాగించాల్సి ఉంది. అధ్వాన రహదారిని తిరిగి నిర్మించడానికి ప్రభుత్వం టఫ్‌ఐడీసీ కింద ఆరు నెలల కిందటే రూ.23 లక్షలను మంజూరు చేసింది. వీటి ఆధారంగా రహదారులు భవనాల శాఖ అధికారులు గుంతల మయంగా మారిన రోడ్డుపై తారును తొలగించారు. కొత్తగా కంకర పరిచి తారును వేశారు. సోమవారం రహదారి నిర్మాణం పూర్తి కావడంతో వాహన దారులకు అందుబాటులోకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని