logo

తొలిరోజు 3,535 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

నగరంలో అపసవ్య దిశ ప్రయాణాలు, ముగ్గురు ఎక్కి వెళ్లడంపై సోమవారం నుంచి ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించారు.

Published : 29 Nov 2022 04:50 IST

నెక్లెస్‌ రోడ్‌లో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ ద్విచక్రవాహనంపై 34 చలాన్లు(రూ.10,120 జరిమానా) ఉన్నట్లు గుర్తించి సీజ్‌ చేశారు.

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో అపసవ్య దిశ ప్రయాణాలు, ముగ్గురు ఎక్కి వెళ్లడంపై సోమవారం నుంచి ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. ఈ రెండు ఉల్లంఘనలపై గత వారం రోజులుగా ట్రాఫిక్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ సారథ్యంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. అనంతరం తనిఖీలు చేపట్టారు. మొదటిగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్న చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, నల్లకుంట, చిక్కడపల్లి, గోషామహల్‌ తదితర 50 ప్రధాన మార్గాలపై దృష్టిసారించారు. తొలిరోజు రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌పై 2981, ట్రిపుల్‌ రైడింగ్‌పై 554 కేసులు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. కొందరు ట్రాఫిక్‌ పోలీసులతో వాదనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో తిరుగుతున్న ఇతర జిల్లాల ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఈ అంశంపై ఆటో యూనియన్లు ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని