logo

లాభాల తొవ్వలోకి తొలి అడుగు

నష్టాల బాటలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ లాభాల దిశగా తొలి అడుగు వేసింది. విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్‌ బస్సులు సంస్థకు గుదిబండ అనుకునే పరిస్థితి నుంచి బయటపడ్డాయి.

Published : 29 Nov 2022 04:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: నష్టాల బాటలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ లాభాల దిశగా తొలి అడుగు వేసింది. విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్‌ బస్సులు సంస్థకు గుదిబండ అనుకునే పరిస్థితి నుంచి బయటపడ్డాయి. రోజూ రూ.1.30 లక్షలు లాభాన్ని ఈ బస్సులు తీసుకువస్తున్నాయని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ చెబుతోంది. ఇదంతా నిరంతర పర్యవేక్షణతోపాటు.. ఎలక్ట్రిక్‌ బస్సులైనందున ఇంధన వ్యయంలో ఆదాతో సాధ్యమైందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 39 ఎలక్ట్రిక్‌ బస్సులకు భవిష్యత్తులో తోడయ్యే 300 బస్సులతో ఆర్టీసీ మరిన్ని మార్గాల్లో గ్రేటర్‌జోన్‌ లాభాలబాట పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌కు ఇది తొలి అడుగు అని ఈడీ యాదగిరి చెప్పారు.

ఎలా సాధ్యమైంది..

* ఏ బస్సు ఎక్కడ ఉంది. ఎప్పుడు వస్తుంది.. ఎన్ని గంటలకు విమానాశ్రయానికి చేరుతుంది అనేది స్పష్టంగా తెలిసేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

* గతంలో విమానాశ్రయానికి వెళ్లేవారు కేవలం 600-700 మంది ఉంటే.. ప్రస్తుతం వీరి సంఖ్య 1200-1500కు చేరింది.

* విమానాశ్రయం నుంచి నగరానికి వచ్చేవారి సంఖ్య గతంలో 2500 ఉంటే.. ఇప్పుడు 3500కు చేరుకుందని ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ వెంకన్న తెలిపారు.

* ఎలక్ట్రిక్‌ బస్సులు కావడంతో కిలోమీటరుకు ఇంధన వ్యయం రూ.6 అవుతోంది.

* కిలోమీటరుకు బస్సుపై పెట్టే వ్యయం రూ.45 కాగా.. ఆదాయం రూ.55కు చేరింది.

* నగదు రహిత సేవలు, వైఫై సదుపాయం, తాగునీరు, వార్తా పత్రిక ఇలా పలు సౌకర్యాలు కూడా కల్పించారు.

రాకపోకలు సాగించే మార్గాలు: 4
రోజు తిరుగుతున్న కి.మీ.లు: 13,000
నిత్యం వస్తున్న లాభం: రూ.1.30 లక్షలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని