logo

ఘనంగా ప్రారంభమైన శారదా విద్యాలయ శతాబ్ది వేడుకలు

కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తున్న హైదరాబాద్‌ శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు సోమవారం ప్రారంభమమ్యాయి.

Published : 29 Nov 2022 17:28 IST

హైదరాబాద్‌: కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తున్న హైదరాబాద్‌ శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు సోమవారం ప్రారంభమమ్యాయి. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వి.కరుణ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, వర్ట్యుసా హైదరాబాద్‌ ఫెసిలిటీ హెడ్‌ కృష్ణ ఎదుల ఈ వేడుకలను ప్రారంభించారు. నిరుపేద విద్యార్థులకు ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో శారదా విద్యాలయ గ్రూప్‌ను 1922లో వై.సత్యనారాయణ ఏర్పాటుచేశారు. ఈ విద్యాలయాన్ని అప్పటి నిజాం ప్రధానమంత్రితో పాటు, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. అత్యంత పురాతన, లాభాపేక్షలేని విద్యాలయంగా శారదా విద్యాలయం ఖ్యాతి గడించింది. 2018లో ‘ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణ’ అవార్డునూ  అందుకుంది. ఈ వేడుకల ప్రారంభోత్సవంలో భాగంగా వందేళ్ల విద్యాలయ ప్రస్థానంలో కీలకమైలురాళ్లతో ఓ ఫొటో గ్యాలరీని ముఖ్యఅతిథి వి. కరుణ ప్రారంభించారు. దీనితో పాటుగా ఏర్పాటుచేసిన పలు స్టాల్స్‌నూ ఆమె సందర్శించారు. కార్యక్రమంలో శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ జయంత్‌ ఠాగోర్‌, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్‌ మాదిరెడ్డి, కరస్పాండెంట్‌ జ్యోత్స్న అంగారా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని