సీసీఎస్‌కు పునర్వైభవం!
నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)ను బలోపేతానికి చర్యలు చేపట్టారు. దొంగలు, దోపిడీ ముఠాలను వేటాడి కీలక కేసులను ఛేదించిన సీసీఎస్ కొంతకాలంగా సైబర్, ఆర్థిక మోసాలకే పరిమితమైంది. దీంతో నేరాల అదుపులో ముఖ్యపాత్ర పోషించే సీసీఎస్ విభాగంలో సమర్థులైన పోలీసు అధికారులను కేటాయించారు.
నేరాల నియంత్రణకు ప్రత్యేక బృందాలు
వివరాలు వెల్లడిస్తున్న నగర సీసీఎస్ జాయింట్ సీపీ డాక్టర్ గజరావు భూపాల్
ఈనాడు, హైదరాబాద్: నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)ను బలోపేతానికి చర్యలు చేపట్టారు. దొంగలు, దోపిడీ ముఠాలను వేటాడి కీలక కేసులను ఛేదించిన సీసీఎస్ కొంతకాలంగా సైబర్, ఆర్థిక మోసాలకే పరిమితమైంది. దీంతో నేరాల అదుపులో ముఖ్యపాత్ర పోషించే సీసీఎస్ విభాగంలో సమర్థులైన పోలీసు అధికారులను కేటాయించారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని నగర సీపీ కార్యాలయంలో నగర సీసీఎస్ జాయింట్ సీపీ డాక్టర్ గజరావు భూపాల్ మీడియాతో మాట్లాడారు. అదనపు డీసీపీ స్నేహమెహ్రా ఆధ్వర్యంలో జోన్ల వారిగా ప్రత్యేక పోలీసు బృందాలను(స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్స్) ఏర్పాటుచేసి నేరాలను కట్టడి చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రత్యేక బృందాల్లో ఇన్‌స్పెక్టర్, ఎస్సై, కానిస్టేబుళ్లు ఉంటారన్నారు. ఈ సందర్భంగా దక్షిణ మండలం బృందం, ఛత్రినాక పోలీసులు ద్విచక్రవాహనాల చోరీ చేస్తున్న కేసులో నిందితులను అరెస్ట్ వివరాలు వెల్లడించారు.
జైలుకు వెళ్లొచ్చినా..: ఉప్పుగూడకు చెందిన టి.ఆకాశ్(27) ఇంటర్ పూర్తిచేశాడు. తండ్రి మరణించాక చదువు మధ్యలోనే ఆపేశాడు. చెడు అలవాట్లకు బానిసై దొంగగా మారాడు. ఒక బాలికను వేధించి పోక్సో కేసు కింద అరెస్టయి జైలుకెళ్లొచ్చాడు. విడుదలయ్యాక నేరాల బాట పట్టాడు. 2013లో షాహినాయత్‌గంజ్, ఛత్రినాక ఠాణా పరిధిలో ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్లు చోరీకి పాల్పడ్డాడు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్స్ పరిధిలో సుమారు 40-50 ద్విచక్రవాహనాలు దొంగతనం చేశాడు. ఇటీవల చోరీ చేసిన 4 ద్విచక్ర వాహనాలను మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహ్మద్ సోహెల్(22)కు విక్రయించాడు. నిందితులను అరెస్ట్ చేసి ఛత్రినాక పోలీసులకు అప్పగించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Harmanpreet Kaur: మా దృష్టి వేలంపై లేదు.. పాక్‌తో మ్యాచ్‌పైనే ఉంది: హర్మన్ ప్రీత్ కౌర్
-
India News
Assam: బాల్య వివాహాలు.. 3 రోజుల్లో 2,278మంది అరెస్టు
-
Politics News
Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!
-
Movies News
NTR: నా భార్య కంటే ముందు మీకే చెబుతా.. దర్శక- నిర్మాతలపై ఒత్తిడి తేవొద్దు: ఎన్టీఆర్
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Politics News
Congress: ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు కాంగ్రెస్‌తో చేయి కలపాలి: మాణిక్ రావ్ ఠాక్రే