logo

విజ్ఞాన ప్రదర్శనలతో పిల్లల్లో సృజనాత్మకత

విద్యార్థుల్లో సృజనాత్మకశక్తిని పెంపొందించడానికి విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడతాయని వరంగల్‌ ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ పుల్లా రవికుమార్‌ పేర్కొన్నారు.

Published : 30 Nov 2022 01:31 IST

నమూనాలను తిలకిస్తున్న డీఈఓ రోహిణి, అధికారులు

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకశక్తిని పెంపొందించడానికి విజ్ఞాన ప్రదర్శనలు దోహదపడతాయని వరంగల్‌ ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ పుల్లా రవికుమార్‌ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫారెస్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి 30వ జాతీయ చిల్డ్రెన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ ఎగ్జిబిషన్‌ మంగళవారం పాతబస్తీ బీబీబజార్‌లోని పోలారిస్‌ పాఠశాలలో ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.రోహిణి నమూనాలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్లానిటోరి సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రాఘవేందర్‌ కుమార్‌, డిప్యూటీ ఈవోలు సయ్యద్‌ ఖాజా ముఖరం, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, నెహ్రూబాబు, జిల్లా సైన్స్‌ అధికారి ధర్మేందర్‌రావు, జిల్లా సైన్స్‌ ఎగ్జిబిషన్‌ పీఆర్‌వో డాక్లర్‌ ఎస్‌.విజయ్‌భాస్కర్‌, ఖాలెద్‌ మహ్మద్‌ బాజబర్‌ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు