ఇన్కమ్ ట్యాక్స్ భవనం పైనుంచి పడి ఉద్యోగి దుర్మరణం
ఇన్కమ్ ట్యాక్స్ టవర్ భవనం ఐదో అంతస్తు నుంచి అనుమానాస్పద స్థితిలో కిందపడి అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దుర్మరణం చెందిన ఘటన నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.
నాంపల్లి, న్యూస్‌టుడే: ఇన్కమ్ ట్యాక్స్ టవర్ భవనం ఐదో అంతస్తు నుంచి అనుమానాస్పద స్థితిలో కిందపడి అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దుర్మరణం చెందిన ఘటన నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... అశుతోష్‌శర్మ(25) స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్ గౌతంబుద్ధానగర్ జిల్లా సక్కమజ్రబత్త. గత ఏడాది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగానికి ఎంపికై నగరంలోని ఏసీగార్డ్స్‌లో ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయంలో విధుల్లో చేరాడు. గచ్చిబౌలిలో స్టాఫ్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటూ ఇన్కమ్ ట్యాక్స్ టవర్ కార్యాలయ ఐదో అంతస్తు డి-బ్లాక్‌లో ఇన్వార్డ్ సెక్షన్లో పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం కార్యాలయ భవనం వెనుక వైపున ఏదో పడ్డట్లు పెద్ద శబ్దం రావడంతో తోటి ఉద్యోగులు వెళ్లి చూడగా అశుతోష్‌శర్మ రక్తపుమడుగులో కనిపించడంతో అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న నాంపల్లి పోలీసులు పరిశీలించగా అప్పటికే అతడు మృతిచెంది ఉండటంతో పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు పడ్డాడా.. అని పోలీసులు విచారిస్తున్నారు. అశుతోష్‌శర్మ పైచదువులకు సన్నద్ధమవుతున్నాడని, ఈలోగానే కుటుంబీకులు పెళ్లి సంబంధం చూడటంతో నిరాకరించాడని, వారం రోజులుగా ముభావంగా ఉంటున్నాడని, వచ్చే నెల మొదటి వారంలో ఊరెళ్లేందుకు సెలవు కూడా పెట్టిన్నట్లు తోటి ఉద్యోగులు చెప్పారని పోలీసులు వెల్లడించారు.కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Sports News
Harmanpreet Kaur: మా దృష్టి వేలంపై లేదు.. పాక్‌తో మ్యాచ్‌పైనే ఉంది: హర్మన్ ప్రీత్ కౌర్
-
India News
Assam: బాల్య వివాహాలు.. 3 రోజుల్లో 2,278మంది అరెస్టు
-
Politics News
Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!
-
Movies News
NTR: నా భార్య కంటే ముందు మీకే చెబుతా.. దర్శక- నిర్మాతలపై ఒత్తిడి తేవొద్దు: ఎన్టీఆర్
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా