logo

మాస్కో బ్రిక్స్‌ స్కూల్‌ సదస్సులో తెలుగు టెకీ

అంతర్జాతీయ వేదికపై తెలుగు టెకీ మెరిశాడు. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు రష్యాలోని మాస్కోలో జరిగిన ఆరో బ్రిక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సదస్సులో భారత్‌ తరఫున హైదరాబాద్‌ టెకీ రజత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Published : 30 Nov 2022 01:31 IST

రజత్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ వేదికపై తెలుగు టెకీ మెరిశాడు. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు రష్యాలోని మాస్కోలో జరిగిన ఆరో బ్రిక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సదస్సులో భారత్‌ తరఫున హైదరాబాద్‌ టెకీ రజత్‌కుమార్‌ పాల్గొన్నారు. బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌, రష్యా,  ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల్లోని రాజకీయ, ఆర్థిక, మానవత్వం, ఎంటర్‌ప్రెన్యూషిప్‌, అంతర్జాతీయ సంబంధాల వంటి అంశాల్లో వృత్తి నిపుణులకు శిక్షణ, పరస్పర అనుభవాలను పంచుకునేందుకు నిర్వహించే వినూత్న సదస్సు ఇది.  బ్రిక్స్‌ దేశాలే కాదు ఫ్రాన్స్‌, ఈక్వెడార్‌, కొరియా, కజకిస్తాన్‌ మరిన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని