logo

ఐటీలో మేటి..ఏసీ బస్సుల్లేవేంటి?

ఐటీ కారిడార్‌కు ఆర్టీసీ నడిపే బస్సులు అధ్వానంగా ఉన్నాయి. బెంగళూరు ఐటీ కారిడార్‌లో 834 ఏసీ బస్సులను బెంగళూరు మెట్రోపాలిటిన్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ (బీఎంటీసీ) నడుపుతోంది.

Published : 30 Nov 2022 01:31 IST

ప్రైవేటును ఆశ్రయిస్తున్న సంస్థలు

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ కారిడార్‌కు ఆర్టీసీ నడిపే బస్సులు అధ్వానంగా ఉన్నాయి. బెంగళూరు ఐటీ కారిడార్‌లో 834 ఏసీ బస్సులను బెంగళూరు మెట్రోపాలిటిన్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ (బీఎంటీసీ) నడుపుతోంది. కొవిడ్‌తో వర్క్‌ ఫ్రం హోం నడుస్తుండడంతో బస్సులను 373కి కుదించింది. జనవరి నుంచి పూర్తి స్థాయిలో  నడిపేందుకు సిద్ధమౌతోంది. మన నగరంలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మనకున్న 39 ఏసీ బస్సులు విమానాశ్రయ మార్గాల్లో పరిమితమయ్యాయి. కొత్త ఏడాది ఆరంభంలో 300 ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తున్నాయని టీఎస్‌ఆర్టీసీ చెబుతోంది. అవన్నీ సాధారణ బస్సులేనట.

వచ్చే ఏడాదికైనా సిద్ధం కావాలి.. నగరంలో దాదాపు 500 ఐటీ కంపెనీలున్నాయి. ఐటీ ఆధారిత, సేవా రంగాలను కలిపితే 1000కిపైగా కొలువుదీరాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు దాదాపు 7 లక్షల మంది ఉంటారు. వీరిలో 60 శాతం నగరంలో వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మెట్రో, ఎంఎంటీఎస్‌ స్టేషన్ల నుంచి ఉద్యోగులను ఐటీ కారిడార్‌కు చేర్చాలంటే కనీసం 500 బస్సుల అవసరం. అవి లేక వ్యక్తిగత వాహనాలపై వెళ్తూ ట్రాఫిక్‌జామ్‌లకు కారణమవుతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి ఐటీ ఉద్యోగులు ప్రజారవాణాను వినియోగించేలా ఆర్టీసీ బస్సులు సమకూర్చాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. ఆర్టీసీ స్పందించకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌తో ఐటీ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని