logo

క్రిప్టోలో లాభాలంటూ రూ.27 లక్షలు స్వాహా

క్రిప్టోలో పెట్టుబడితో లాభాలు వస్తాయని నమ్మించి రూ.27 లక్షలు దోచేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Published : 30 Nov 2022 01:58 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: క్రిప్టోలో పెట్టుబడితో లాభాలు వస్తాయని నమ్మించి రూ.27 లక్షలు దోచేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..సికింద్రాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాస్‌ చరవాణి నంబరు తన ప్రమేయం లేకుండానే సైబర్‌ మోసగాళ్ల టెలిగ్రామ్‌ గ్రూప్‌తో అనుసంధానమైంది. అందులో సూచించిన విధంగా రెండు విడతలుగా రూ.10వేలు, రూ.80 వేలు పెట్టగా పోయాయి. ఓ వ్యక్తి ఫోన్‌ చేసి అష్యూర్డ్‌ ప్రొడక్టుపై పెట్టుబడి పెడితే లాభాలు ఇస్తామని చెప్పడంతో బాధితుడు రూ.2.5 లక్షలు పెట్టాడు. లాభం వచ్చినట్లు చూపిస్తున్నా విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. మరో రూ.2.5 లక్షలు కడితే ఆ లాభం పొందవచ్చునని నమ్మించి ఇలా మొత్తం రూ.27 లక్షలు లాగేశాడు.  

నరేష్‌, పవిత్ర లోకేష్‌ కేసులో  నోటీసులు.. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ నటులు నరేష్‌, పవిత్ర లోకేష్‌లు చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు దర్యాప్తులో వేగాన్ని పెంచారు. ఈ ఘటనలో యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేసిన మల్కాజిగిరికి చెందిన ఇమండి నాగేశ్వర్‌కు నోటీసులు ఇచ్చామని  ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని