దుర్గంచెరువులోకి దూకిన యువతిని రక్షించిన పోలీసులు
కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దుర్గంచెరువులోకి దూకిన యువతిని లేక్ పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇన్‌స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాలు..
మాదాపూర్, న్యూస్‌టుడే: కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దుర్గంచెరువులోకి దూకిన యువతిని లేక్ పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇన్‌స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాలు.. మెహిదీపట్నం రేతిబౌలి సమీప సప్తగిరి కాలనీకి చెందిన యువతి(19) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. మంగళవారం సాయంత్రం మాదాపూర్‌లోని కేబుల్ వంతెన వద్దకు వచ్చిన ఆమె అకస్మాత్తుగా వంతెన మీద నుంచి చెరువులోకి దూకింది. ఇది గమనించి పెట్రోలింగ్ పోలీసు కానిస్టేబుల్ వెంటనే లేక్ పోలీసులను అప్రమత్తం చేశాడు. ఎస్‌ఐ భానుప్రకాష్, బోట్ డ్రైవర్ మనోహర్ నీట మునుగుతున్న యువతిని బయటకు తీసి మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆత్మహత్యయత్నానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదని ఇన్‌స్పెక్టర్ తిరుపతి పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
NTR: భార్య కంటే ముందు మీకే చెబుతా.. దర్శక- నిర్మాతలపై ఒత్తిడి తేవొద్దు: ఎన్టీఆర్
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Politics News
Congress: ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు కాంగ్రెస్తో చేయి కలపాలి: మాణిక్ రావ్ ఠాక్రే
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
Crime News
Hyderabad: సినిఫక్కీలో కిడ్నాప్.. డబ్బులు దోచుకొని పరార్