logo

‘యశోద’ సినిమాపై కేసు ఉపసంహరణ

సమంత ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘యశోద’ సినిమాలో ఈవా ఐవీఎఫ్‌ ఆసుపత్రి పేరు వాడకంపై తలెత్తిన వివాదం ముగిసింది.

Published : 30 Nov 2022 01:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: సమంత ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘యశోద’ సినిమాలో ఈవా ఐవీఎఫ్‌ ఆసుపత్రి పేరు వాడకంపై తలెత్తిన వివాదం ముగిసింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ ఆసుపత్రి యాజమాన్యం, చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. సినిమాలో ఆసుపత్రి పేరు కనిపించకుండా చేసిన మార్పులపై ఆసుపత్రి యాజమాన్యం సంతృప్తి చెందుతూ కేసు ఉపసంహరించుకుంది. ఈ విషయంపై నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఒకరిని బాధపెట్టే ఉద్దేశం, ఒకరి మనోభావాల్ని కించపరిచే ఆలోచన మాకు లేదని తెలిపారు. మా బ్రాండ్‌కి ఇబ్బంది కలగడంతోనే కేసు వేశాం తప్ప, డబ్బు కోసం కాదని ఆస్పత్రి ఎండీ మోహన్‌రావు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని