logo

‘ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలి’

తాండూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ డిమాండ్‌ చేశారు.

Published : 30 Nov 2022 01:58 IST

అధ్యాపకులతో మాట్లాడుతున్న బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌

తాండూరు టౌన్‌: తాండూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ డిమాండ్‌ చేశారు. తమను బయటి వ్యక్తులు వేధిస్తున్నారని విద్యార్థినులు ఆయనకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన మంగళవారం కళాశాలకు వెళ్లి ప్రిన్సిపల్‌ అందుబాటులో లేకపోవడంతో అధ్యాపకులతో మాట్లాడారు. ఇదే విషయమై అక్కడి నుంచి ఆయన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, స్థానిక డీఎస్పీ శేఖర్‌గౌడ్‌తో మాట్లాడారు. ఆకతాయిలు అమ్మాయిల ఫొటోలు తీస్తున్నారని తెలిపారు. కళాశాలకు ప్రహరీ, గేటు లేక పోవటంతో ఆకతాయిలకు అడ్డాగా మారిందని చెప్పారు. కళాశాల సమయాల్లో పోలీసు పెట్రోలింగ్‌ నిర్వహించాలని కోరారు. పోలీసు అధికారులు అప్పటికప్పుడు ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డితో పాటు షీ బృందాన్ని అక్కడికి పంపించారు. ఇక నుంచి ఎవరైనా వేధిస్తే వెంటనే షీ బృందానికి సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. విద్యార్థినులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు దీపక్‌రెడ్డి, సురేష్‌, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని