Eatala Rajender: సీఎం కేసీఆర్‌ పదే పదే ప్రజలను రెచ్చగొడుతున్నారు: ఈటల రాజేందర్‌

సీఎం కేసీఆర్‌.. మంచి జరిగితే తన ఖాతాలోకి, చెడు జరిగితే ఇతరులపై నెట్టివేస్తారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. సీఎం పదే పదే ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు.

Published : 30 Nov 2022 15:28 IST

హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దూషించే స్థాయికి సీఎం కేసీఆర్‌ దిగజారిపోయారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. సీఎం పదే పదే ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్.. మంచి జరిగితే తన ఖాతాలోకి, చెడు జరిగితే ఇతరులపై నెట్టివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయడం మంచిదికాదన్నారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 14శాతం రాష్ట్రాలకు పంచుతుందని ఈటల తెలిపారు. రాష్ట్రాలకు సంబంధించి పలు నిబంధనలు, ప్రగతి, ఇతరత్రా అంశాల ఆధారంగా కేటాయింపులు ఉంటాయని చెప్పారు. అంతే కానీ.. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఒకలా.. భాజపాయేతర రాష్ట్రాల్లో మరో విధంగా కేటాయింపులు చేస్తోందనేది అవాస్తవమన్నారు. బడ్జెట్ పేపర్‌లో ఎక్కువ పెట్టుకొని కేంద్రం తక్కువ ఇస్తుందని బద్నాం చేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఈటల ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని