అక్కడ తిన్నారంటే.. ఆస్పత్రికి వెళ్తారంతే!
నాణ్యత గురించి ఆలోచించకుండా.. కనిపించిన ప్రతి ఆహార పదార్థాన్నీ ఆరగించొద్దు. గుడ్డిగా తిన్నారంటే.. ఆరోగ్యం ఆవిరవడం పక్కా. ఎందుకంటే.. తాగే ‘టీ’ నుంచి.. బ్రేవ్ మనేలా లాగించే మాంసాహారం వరకు.. మెజార్టీ ఆహార పదార్థాలు కల్తీలో మునిగి తేలుగుతున్నాయి.
శవర్మ, మండి బిర్యానీల్లో నాసిరకం పదార్థాల వినియోగం
ఈనాడు, హైదరాబాద్: నాణ్యత గురించి ఆలోచించకుండా.. కనిపించిన ప్రతి ఆహార పదార్థాన్నీ ఆరగించొద్దు. గుడ్డిగా తిన్నారంటే.. ఆరోగ్యం ఆవిరవడం పక్కా. ఎందుకంటే.. తాగే ‘టీ’ నుంచి.. బ్రేవ్ మనేలా లాగించే మాంసాహారం వరకు.. మెజార్టీ ఆహార పదార్థాలు కల్తీలో మునిగి తేలుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఆహార కల్తీ నియంత్రణాధికారుల తనిఖీల్లో ఆ విషయం స్పష్టమైంది. బంజారాహిల్స్‌లో కల్తీ టీ పొడి, మెట్టుగూడలో హానికర నూనెలు, టోలిచౌకిలో అనారోగ్యకరమైన మాంసాహారం.. ఇలా అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి.
తనిఖీలతో వెలుగులోకి ఇలా: సంచార ప్రయోగశాల సేవలను జీహెచ్‌ఎంసీ ఇటీవల ప్రారంభించింది. వంటల్లోవాడే దినుసులు, నూనెలు, పాలు, ద్రవాలు, ఆహార పదార్థాలను పరీక్షించి.. కల్తీని కనిపెట్టే పరికరాలు అందులో ఉంటాయి. వాటి సాయంతో ఇప్పటి వరకు సుమారు వంద నమూనాలను పరీక్షించగా.. సగానికిపైగా కల్తీవే అని స్పష్టమైంది.
* తార్నాక, మెట్టుగూడ ప్రాంతాల్లో చిరుతిండ్ల బండ్లు, దుకాణాల నుంచి 10 నమూనాలను తనిఖీ చేస్తే.. వాటిలో ఉపయోగిస్తున్న నూనె అనారోగ్యకరంగా ఉన్నట్లు తేలింది. ఆరోగ్యకరమైన నూనెలో 15శాతం మేర పోలార్ కాంపొనెంట్స్ ఉండాలి. తనిఖీ చేసిన పదార్థాల్లో మాత్రం.. అవి 25 శాతం మేర ఉన్నట్లు తేలింది. ఇలాంటి నూనె విషంలా మారినట్లేనని అధికారులు చెబుతున్నారు. పదేపదే మరిగించి వాడే నూనె ఇలా మారుతుందన్నారు.
* బంజారాహిల్స్‌లోని రోడ్డు పొడవునా ఉన్న ఎనిమిది టీ దుకాణాల్లో తనిఖీ చేయగా.. టీ పొడిలో హానికర రంగు ఉపయోగించినట్లు తేలింది. గుర్తుతెలియని వ్యక్తి ప్లాస్టిక్ సంచుల్లో నింపిన టీ పొడిని దుకాణదారులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. అతనిపై నిఘా ఉంచినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.
హోటల్ మూత.. టోలిచౌకిలోని ఫెల్‌ఫెలా హోటల్‌లో.. తాజాగా మండి బిర్యానీ తిని ఎనిమిది మంది ఆస్పత్రిపాలయ్యారు. వారి ఫిర్యాదుతో జీహెచ్‌ఎంసీ సంచార ప్రయోగశాల అక్కడి చేరుకుని.. ఆహార పదార్థాలను తనిఖీ చేసింది. మయనీజ్ నాసిరకంగా ఉన్నట్లు, కోడి మాంసం వంటకాల్లో రంగును అధికంగా ఉపయోగించినట్లు వెల్లడైంది. అధికారులు ఆ హోటల్‌ను మూసేశారు. బాధితులు కోలుకుంటున్నారని జీహెచ్‌ఎంసీ సీనియర్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. కోడిగుడ్డు, సోయానూనెతో మయనీజ్‌ను తయారుచేసి, మండి బిర్యానీ, శవర్మా వంటి వంటకాలతోపాటు వడ్డిస్తారని.. వాటిని తయారు చేసి, నిల్వ ఉంచే క్రమంలో వ్యాపారులు ప్రమాణాలు పాటించట్లేదని ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ సౌమ్యరెడ్డి వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్
-
Politics News
Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ
-
Crime News
Andhra News: విజయవాడలో విషాదం.. వాటర్ హీటర్ తగిలి తండ్రి, కుమార్తె మృతి
-
General News
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ సెషన్ 1 ప్రాథమిక కీ విడుదల
-
World News
Pakistan: పోలీసు యూనిఫాంలో వచ్చి.. మారణహోమం సృష్టించి..!
-
Sports News
INDW vs SAW: ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్ ఓటమి..