MMTS: యాదాద్రికి ఎంఎంటీఎస్‌పై మళ్లీ ఆశలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సాధారణ రోజుల్లో 30 వేలకు పైగా శని, ఆదివారాల్లో 50 వేల మంది దర్శించుకుంటున్నారు. నగరం నుంచి వెళ్లేవారే అత్యధికులు.
ఈనాడు, హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సాధారణ రోజుల్లో 30 వేలకు పైగా శని, ఆదివారాల్లో 50 వేల మంది దర్శించుకుంటున్నారు. నగరం నుంచి వెళ్లేవారే అత్యధికులు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తక్కువ ఖర్చుతో ప్రయాణ వనరు కల్పించాలని నిర్ణయించింది. ఎంఎంటీఎస్ రెండోదశ పొడిగింపే సరైనదని భావించింది. ప్రణాళికలు సిద్ధం చేసినా అది పట్టాలెక్కలేదు. తాజాగా మంత్రి కేటీఆర్ ప్రకటనతో ఆశలు చిగురించాయి.
మరో 32 కి.మీ. మాత్రమే
సికింద్రాబాద్ నుంచి ఘట్‌కేసర్(21 కి.మీ.) వరకూ ఎంఎంటీఎస్ రెండో దశ కింద రైల్వే లైను నిర్మిస్తున్నారు. ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి(రాయగిరి) వరకూ మరో 32 కి.మీ. రెండో దశను పొడిగిస్తే భక్తులు సులభంగా యాదాద్రికి వెళ్లొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అంచనాలు రూపొందించాలని ఆరేళ్ల క్రితం రైల్వేశాఖను కోరగా అప్పట్లో రూ.330 కోట్లు అవుతుందని తేల్చింది. ఒక వాటాగా రైల్వే రూ.110 కోట్లు సమకూర్చాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెండు వాటాల కింద రూ.220 కోట్లు అందజేయాల్సి ఉంది. రెండో దశ పూర్తయితే నగరం నుంచి రూ.15 టికెట్‌తో యాదాద్రి చేరుకునే అవకాశం లభించేది. రూ.816 కోట్లతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.544 కోట్లకు గాను ఇప్పటివరకూ రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో పనులు ఆగిపోయాయి. ఇటీవల రూ.200 కోట్లు కేటాయిస్తామని పురపాలక మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనతో మళ్లీ యాదాద్రికి ఎంఎంటీఎస్ రెండో దశ పొడిగింపు ఆశలు చిగురించాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
రామ్ రామ్ అనమంటూ కుక్కకు ఎమ్మెల్యే శిక్షణ
-
Movies News
Director Sagar: సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత
-
Politics News
Balineni: నిరూపించలేకపోతే పోటీనుంచి తప్పుకొంటారా?: కోటంరెడ్డికి బాలినేని సవాల్
-
General News
Top Ten News @ 9 AM: బడ్జెట్ ప్రత్యేకం.. ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Buggana: సీఎం ఎక్కడుంటే అదే పరిపాలన రాజధాని: బుగ్గన
-
World News
Pakistan: ముజాహిదీన్లను సృష్టించి తప్పు చేశాం: పార్లమెంటులో పాక్ మంత్రి