logo

సంతకం లేని అజెండా చెల్లదన్నారు: స్వప్న

గతంలో తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి తన సంతకం లేకుండా ఆమోదం పొందిన అజెండా చెల్లదని మున్సిపల్‌ ఉన్నతాధికారులు తెలిపారని ఛైర్‌పర్సన్‌ స్వప్న అన్నారు.

Published : 01 Dec 2022 02:37 IST

మాట్లాడుతున్న స్వప్న

తాండూరు: గతంలో తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి తన సంతకం లేకుండా ఆమోదం పొందిన అజెండా చెల్లదని మున్సిపల్‌ ఉన్నతాధికారులు తెలిపారని ఛైర్‌పర్సన్‌ స్వప్న అన్నారు. తాండూరులోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అజెండా విషయమై తాను హైకోరును ఆశ్రయించానన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నవంబరు 29న (మంగళవారం) మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఉన్న తాను, ఇన్‌ఛార్జి కమిషనర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముందు హాజరైనట్లు చెప్పారు. వాదనలు విన్న అధికారులు ఛైర్‌పర్సన్‌ సంతకం లేని అజెండా ఆమోదం పొందదని చెప్పినట్లు వివరించారు.  ఈ విషయాన్ని అధికారులు న్యాయస్థానానికి వివరిస్తారా లేదంటే సదరు అధికారిపై చర్యలు తీసుకుంటారా అనే విషయం వారం రోజుల్లో తేలనుందని పేర్కొన్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు వెంకన్నగౌడ్‌, రవిరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని