కుష్ఠు.. అనుమానితులపై 5 నుంచి సర్వే..
కుష్ఠు వ్యాధి రోగులను గుర్తించి సకాలంలో మందులు అందించి వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
న్యూస్టుడే, కొడంగల్ గ్రామీణం, బొంరాస్పేట
కుష్ఠు వ్యాధి రోగులను గుర్తించి సకాలంలో మందులు అందించి వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి అనుగుణంగా వైద్య, ఆరోగ్యశాఖ ‘జాతీయ కుష్ఠు నిర్మూలన’లో భాగంగా అనుమానితులను గుర్తించేందుకు డిసెంబరు 5నుంచి 14 రోజులు ఇంటింటి సర్వే చేపట్టనుంది. ఇక్కడ కేవలం అనుమానితుల వివరాలు మాత్రమే సేకరిస్తారు.
ప్రస్తుతం 93 మంది..
జిల్లాలోని 20 మండలాల్లో ప్రస్తుతం 93 మంది కుష్ఠు వ్యాధి బాధితులున్నారు. తాజాగా కొత్త వారిని గుర్తించేందుకు 25 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉండగా, 720 మంది ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే చేయనున్నారు. పది మందికి ఒకరి చొప్పున సిబ్బంది పర్యవేక్షకులుగా ఉంటారు. ఉదయం 6గంటల నుంచి రోజు 20 నివాసాల్లో ఇంటింటి సర్వేతో వివరాలు సేకరించాలి. ప్రాథమిక లక్షణాలను గుర్తించి వారికి 15 రోజుల పాటు సమీప వైద్యాధికారులు, సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు. పక్కాగా ఎవరికైనా కుష్ఠు వ్యాధి ఉందని తేలితే చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటారు. జిల్లాలో కుష్ఠు వ్యాధి నమోదు సంఖ్య తక్కువగా ఉండటంతో వందశాతం అరికట్టే విధంగా అధికారులు కృషి చేస్తున్నారు. వ్యాధి లక్షణాలు సకాలంలో గుర్తిస్తే అంగవైకల్యం సంభవించకుండా కాపాడవచ్చని వైద్యులు అంటున్నారు.
* చర్మంపై గోధుమరంగులో మొద్దుబారిన, స్పర్శ లేని మచ్చలు ఏర్పడటం, తిమ్మిరితో కూడిన మచ్చలు, పాలిపోయిన మచ్చలు కనిపిస్తే ప్రాథమిక లక్షణాలుగా గుర్తించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
రెండేళ్లుగా సర్వే లేక తెలియని లెక్క..
కరోనా ప్రభావంతో రెండేళ్ల్లుగా కుష్ఠు వ్యాధి బాధితులను గుర్తించేందుకు సర్వేలు చేపట్టకపోవటంతో రోగులు ఎంతమంది ఉన్నారనే లెక్క బయటపడలేదు. ఈసారి మాత్రం పక్కాగా చేపడుతున్నారు. వ్యాధితో ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న వారి వివరాలు కూడా సేకరిస్తారు.
ప్రారంభ దశలో లక్షణాలు గుర్తించేందుకు..
రవీంద్ర యాదవ్, కుష్ఠువ్యాధి ప్రోగ్రాం జిల్లా అధికారి
ఇంటింటి సర్వేకు ప్రజల సహకారం పూర్తిస్థాయిలో అవసరం. ప్రారంభ దశలోనే వ్యాధి లక్షణాలు గుర్తిస్తే సకాలంలో వైద్య సేవలు అందిస్తాం. నొప్పి లేదు కదా... చిన్న మచ్చలే అంటూ నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పుడు చేపడుతున్న సర్వేలో అనుమానం ఉన్న ప్రతి ఒకరూ వివరాలు నమోదు చేసుకోవాలి. వ్యాధి నిర్ధరణ జరిగితే ఉచిత మందులు ఇచ్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03/02/23)
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
India News
IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్ విజ్ఞప్తి
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Mussorie: ముస్సోరీలో వెంటనే అధ్యయనం చేయండి: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం