కుల గణన సాధనకు పోరాటం: వకుళాభరణం
దేశంలో వంద మంత్రిత్వ శాఖలు ఉండగా 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరమని తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు.
మాట్లాడుతున్న కృష్ణమోహన్‌రావు
ఖైరతాబాద్: దేశంలో వంద మంత్రిత్వ శాఖలు ఉండగా 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరమని తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు కుమారస్వామి అధ్యక్షతన ‘కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ, జన గణనలో కుల గణన’ అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, దిల్లీలో రైతు పోరాటం మాదిరి కేంద్రంపై మరో ఉద్యమంతో కుల గణన సాధించుకోవాలని చెప్పారు. మాజీ మంత్రి కృష్ణయాదవ్,బీసీ ఫెడరేషన్ కులాల సమితి అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు, బీసీ సంఘాల నేతలు డా.డీబీచారి, శంకర్ గంగపుత్ర, యుగంధర్, దివ్య, మహేష్, పద్మ, నిర్మల్కుమార్యాదవ్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03/02/23)
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
India News
IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్ విజ్ఞప్తి
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Mussorie: ముస్సోరీలో వెంటనే అధ్యయనం చేయండి: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం