logo

తీన్మార్‌ మల్లన్నతోపాటు మరొకరిపై కేసు

తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌, సిద్ధగోలు సుదర్శన్‌లపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 01 Dec 2022 02:37 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌, సిద్ధగోలు సుదర్శన్‌లపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన వ్యాపారి మహ్మద్‌ ఫయాజ్‌ వాట్సాప్‌నకు 28న మధ్యాహ్నం 1 గంటకు ఓ వీడియో వచ్చింది. అందులో క్యూ న్యూస్‌ వెబ్‌ ఛానెల్‌లో తీన్మార్‌ మల్లన్నతోపాటు సిద్ధగోలు సుదర్శన్‌ సంభాషణ ఉంది. ఆ సంభాషణలో రాజకీయ పార్టీలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఫయాజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతోపాటు ఫయాజ్‌ సమర్పించిన వీడియో పరిశీలించిన పోలీసులు తీన్మార్‌ మల్లన్న, సిద్ధగోలు సుదర్శన్‌లపై 153(ఎ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు