logo

క్షయ రోగి సమాచారం ఇస్తే రూ.500 బహుమతి

క్షయ వ్యాధి(టీబీ)పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యుద్ధం ప్రకటించింది. కొత్తగా ఎక్కడ రోగి కన్పించినా సంబంధిత వ్యక్తుల పూర్తి సమాచారం సేకరించి వారికి చికిత్సలు అందించాలని నిర్ణయించింది.

Published : 01 Dec 2022 02:37 IST

నగర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: క్షయ వ్యాధి(టీబీ)పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యుద్ధం ప్రకటించింది. కొత్తగా ఎక్కడ రోగి కన్పించినా సంబంధిత వ్యక్తుల పూర్తి సమాచారం సేకరించి వారికి చికిత్సలు అందించాలని నిర్ణయించింది.  కొత్తగా క్షయ వ్యాధి నిర్ధారణ అయిన రోగి సమాచారం అందించిన ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలకు రోగికి రూ.500 చొప్పున బహుమతి అందించనున్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి సెమినార్‌ హాలులో ప్రభుత్వ వైద్య అధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల మెడికల్‌ డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో హైదరాబాద్‌ వైద్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటి ఈ మేరకు ప్రకటించారు. ప్రస్తుతం క్షయ వ్యాధి నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. మిజిల్స్‌, రుబెల్లా వ్యాధులపై ప్రైవేటు ఆసుపత్రులు అప్రమత్తం కావాలన్నారు. ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు, జ్వరంతో ఎవరైనా రోగులు ఆసుపత్రిలో చేరితే ఆ సమాచారం వెంటనే వైద్య ఆరోగ్యశాఖకు అందించాలని సూచించారు.

స్కానింగ్‌ సెంటర్లపై నిఘా

నగరంలో ల్యాబ్‌లు, స్కానింగ్‌ కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ కొరఢా ఝళిపించనుంది. కొన్ని స్కానింగ్‌ కేంద్రాలు, నర్సింగ్‌హోంలు గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయని, ఇలాంటి స్కానింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవని డాక్టర్‌ వెంకటి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని