స్వచ్ఛతా కిట్లు.. ఎక్కడ..!
ప్రభుత్వ బడుల్లో శుభ్రత కోసం గతంలో ఏడు రకాల సామగ్రితో కూడిన ‘స్వచ్ఛతా కిట్’లను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అందజేసేవారు.
పాఠశాలల శుభ్రతకు అందని ఏడు రకాల వస్తువులు
న్యూస్‌టుడే; పాత తాండూరు, బషీరాబాద్
ప్రభుత్వ బడుల్లో శుభ్రత కోసం గతంలో ఏడు రకాల సామగ్రితో కూడిన ‘స్వచ్ఛతా కిట్’లను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అందజేసేవారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్ మిషన్ పథకం 2018 విద్యా సంవత్సరం వరకు సాఫీగా సాగింది. దీనికింద కిట్లనూ అందించే వారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు పాఠశాలలు మూతబడి నిలిచిపోయింది. ఏడాదినుంచి సజావుగా సాగుతున్నా వీటి విషయ మాత్రం మరిచిపోయారు. తిరిగి ఇప్పుడైనా కిట్లను పంపిణీ చేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
లక్షకు పైగా విద్యార్థులు
జిల్లాలోని 19 మండలాలు, నాలుగు నియోజక వర్గాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1,325 ఉన్నాయి. వీటిలో 1.15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కరోనా తరువాత శుభ్రతపై ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. గతంలో పంపిణీ చేసిన కిట్‌లో బకెట్, రెండు మగ్గులు, ఐదు సబ్బులు, మరుగుదొడ్డి శుభ్రం చేసేందుకు రెండు బ్రష్‌లు, రెండు సర్ఫ్ ప్యాకెట్లు, విద్యార్థులు చేతి గోళ్లు తీసుకునేందుకు రెండు నెయిల్ కట్టర్లు, ఒక బస్తాను అందజేశారు. ఒక్కో కిట్ ధర రూ.856 చొప్పున చెల్లించి అందజేసేవారు. కరోనా కారణంగా వాటి జాడే లేకుండా పోయింది.
సిబ్బంది లేక ఇబ్బందే..
ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా ఇద్దరు చొప్పున శుభ్రతా సిబ్బంది గతంలో ఉండేవారు. పంచాయతీ సిబ్బందికే పాఠశాలల శుభ్రత బాధ్యతలను అప్పగించడంతో వారు ఎప్పుడో ఒకసారి వచ్చి శుభ్రం చేస్తున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులే శుభ్రతా పనులు చేసుకుంటున్నారు. పాఠశాల నిధుల నుంచే సబ్బులు, చేతులు శుభ్రం చేసుకునే ద్రావణం, ఇతర సామగ్రిని కొనుగోలు చేసుకుంటున్నారు.
అందిస్తే బాగుంటుంది
నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు, తాండూరు
గతంలో అందజేసిన విధంగా శుభ్రతా కిట్‌లను అందిస్తే ఎంతో బాగుంటుంది. సామగ్రిని పంపిణీ చేసి, ప్రత్యేకంగా శుభ్రతా సిబ్బందిని నియమించాలి. పాఠశాలలో శుభ్రత విషయమై కొన్ని ఇబ్బందులు తప్పడంలేదు.
ఉన్నతాధికారులకు వివరించాం
సుధాకర్‌రెడ్డి, విద్యాధికారి, యాలాల, బషీరాబాద్.
స్వచ్ఛతా కిట్ల పంపిణీ విషయమై ఉన్నతాధికారులకు వివరించాం. పంపిణీ చేస్తే పాఠశాలలకు అందజేస్తాం. పంచాయతీ సిబ్బందికి బాధ్యతలు అప్పగించడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03/02/23)
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
India News
IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్ విజ్ఞప్తి
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Mussorie: ముస్సోరీలో వెంటనే అధ్యయనం చేయండి: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం