logo

నగరంలో అరణ్యం

పక్షుల కిలకిలరావాలు..పూల పరిమళాలు.. లక్షల్లో మొక్కలు, చెట్లు..  ప్రకృతి ఒడిలోకి రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది ఆ ప్రాంతం. ఎక్కడో మారుమూల అడవిలోకి అడుగుపెడుతున్న అనుభూతి.

Published : 02 Dec 2022 02:26 IST

అవుటర్‌ సమీపంలో అతిపెద్ద మియావాకి అడవి
ఈనెల 4న 5కె, 10కె, సైక్లింగ్‌ వేడుకలు

మియావాకి అడవి

ఈనాడు, హైదరాబాద్‌: పక్షుల కిలకిలరావాలు..పూల పరిమళాలు.. లక్షల్లో మొక్కలు, చెట్లు..  ప్రకృతి ఒడిలోకి రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది ఆ ప్రాంతం. ఎక్కడో మారుమూల అడవిలోకి అడుగుపెడుతున్న అనుభూతి. అది నిజంగా అడవే. అయితే నగర శివార్లలో మనుషులు పెంచిన అడవి. శంషాబాద్‌ అవుటర్‌ రింగ్‌ పక్కనే 18 ఎకరాల విస్తీర్ణంలో మియావాకి అరణ్యాన్ని సృష్టించారు. ఈ ప్రయత్నం ప్రపంచంలో అతిపెద్ద మియావాకి అడవిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం వారాంతాల్లో పలు వేడుకలకు వేదికవుతోంది. డిసెంబరు 4న దేశంలోనే మొదటిసారి మట్టి రోడ్డుపై 5కె, 10కె, సైక్లింగ్‌ నిర్వహిస్తున్నారు.

పరిశోధనతో..:

అడవిని పెంచడం కోసం స్టోన్‌క్రాఫ్ట్‌ సంస్థ బాధ్యులు తెలంగాణలో స్థానిక జాతి మొక్కల గురించి శోధించారు. 220 రకాల్లో 145 మాత్రమే లభ్యమయ్యాయి. అందులోంచి 126 వృక్ష జాతులను స్థానికంగా నాటారు. రెండున్నరేళ్ల క్రితం నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగాయి.  ప్రస్తుతం అడవిలో 4.20 లక్షల మొక్కలు, చెట్లు ఉన్నాయి. 116 రకాల పక్షులకు  నిలయంగా మారింది. శీతాకాలంలో యూరోప్‌ నుంచి కూడా ఇక్కడికి పక్షులు వలస వస్తుంటాయి.


కొవిడ్‌ సమయంలో..:
- కీర్తి చిలుకూరి, ఎండీ, స్టోన్‌క్రాఫ్ట్‌

కొవిడ్‌ సమయంలో వచ్చిన ఆలోచనే మియావాకీ అడవికి ప్రాణం పోసింది. ఆ సమయంలో అందరూ స్వగ్రామాలకు.. ఫాంహౌజ్‌లకు వెళ్లడంతో ఒక్కసారి పాత రోజుల్లోకి వెళ్లినట్లు అనిపించింది. 60 ఎకరాల్లో ఉన్న ఫ్యామ్‌లాండ్‌ యజమానులతో మాట్లాడి... ప్రకృతి కోసం ఏదైనా చేద్దామని.. అందరి భూముల్లోంచి కొంత మియావాకి అడవికి కేటాయించేలా ఒప్పించగలిగాం. అంతా పూర్తయ్యాక ఇదే ప్రపంచంలో ఇది అతిపెద్ద మియావాకి ప్రాజెక్టు అని తెలిసింది. అందుకు గర్వంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని