logo

Hyderabad: వేడుకల్లో దూరతాడు.. బహుమతులు కొట్టేస్తాడు

కరోనా మహమ్మారి ప్రభావంతో కూరగాయల వ్యాపారం దెబ్బతింది. ఆర్థిక ఇబ్బందులతో.. దొంగగా అవతారమెత్తాడు. కల్యాణ మండపాల్లో జరిగే వేడుకలకు వెళ్లి.. అతిథులు అందజేసే బహుమతులు ఎత్తుకెళ్తున్న దొంగను సైదాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.

Updated : 02 Dec 2022 08:53 IST

స్వాధీనం చేసుకున్న వస్తువులతో పోలీసులు

సైదాబాద్‌, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి ప్రభావంతో కూరగాయల వ్యాపారం దెబ్బతింది. ఆర్థిక ఇబ్బందులతో.. దొంగగా అవతారమెత్తాడు. కల్యాణ మండపాల్లో జరిగే వేడుకలకు వెళ్లి.. అతిథులు అందజేసే బహుమతులు ఎత్తుకెళ్తున్న దొంగను సైదాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ. లక్ష నగదు, 10 తులాల బంగారు గొలుసు,  చరవాణి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు (42) నగరానికి చెందిన వాడని చెబుతున్నా పేరు, ఇతర వివరాల వెల్లడికి పోలీసులు నిరాకరించారు. నిందితుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో మినర్వా గార్డెన్స్‌లో జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్‌లో రూ. 4 లక్షలు ఉంచిన బ్యాగును కాజేశాడు. మే నెలలో సామ నర్సింహారెడ్డి గార్డెన్స్‌లో వివాహ వేడుకలో  10 తులాల బంగారు గొలుసు, రెండు చరవాణులు ఎత్తుకెళ్లాడు.  సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో గుర్తించి గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సుబ్బరామిరెడ్డి, డీఐ బి. చంద్రమోహన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని