logo

ఐదేళ్ల చిన్నారిపై వేడి నూనె పోసి..

తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఐదేళ్ల బాలికను అక్కున చేర్చుకోవాల్సిన మేనమామ చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 02 Dec 2022 02:26 IST

మేనమామ చిత్రహింసలు

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఐదేళ్ల బాలికను అక్కున చేర్చుకోవాల్సిన మేనమామ చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..ఫలక్‌నుమా వట్టేపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ సిరాజ్‌.. సోదరి, బావ ఏడాదిన్నర క్రితం మృతి చెందారు. వారి కుమార్తె(5) అనాథగా మారడంతో పెంచుకుంటానని చెప్పి తన ఇంటికి తీసుకువచ్చాడు. చిన్నారిని బడికి పంపకుండా పనిమనిషిగా మార్చేశాడు. పనులు చేయకపోతే బాలికను బెల్టుతో కొట్టేవాడని సమాచారం. ఇటీవల బాలిక ఒంటిపై వేడి నూనె పోయడంతో బాధ భరించలేక బాలిక నారినికేతన్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు సాఫియా మాహికి సమాచారమిచ్చింది. మంగళవారం రాత్రి సాఫియా  పోలీసులతో కలిసి సిరాజ్‌ ఇంటికి వెళ్లి బాలికను చూశారు.  గాయాలు ఎలా అయ్యాయని అడగ్గా..  మేనమామ వేడి నూనె పోశారని వాపోయింది. దీంతో బాలికను హోంకు తరలించారు. బాలిక ఒంటిపై గాయాల మచ్చలు ఉన్నాయని, ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఫలక్‌నుమా ఏసీపీ జహంగీర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని