logo

మూడు నెలల్లో డబ్బు రెట్టింపంటూ మోసం

లక్ష చెల్లించండి.. మూడు నెలల్లో రెండు లక్షలు దక్కించుకోండి ..అంటూ  కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. ఆన్‌లైన్‌లో జనాలను నమ్మించి మోసం చేసిన ఆ ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Published : 02 Dec 2022 02:26 IST

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

షాద్‌నగర్‌, న్యూస్‌టుడే: లక్ష చెల్లించండి.. మూడు నెలల్లో రెండు లక్షలు దక్కించుకోండి ..అంటూ  కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. ఆన్‌లైన్‌లో జనాలను నమ్మించి మోసం చేసిన ఆ ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ఖాజామొయనుద్దీన్‌, ఉత్తరప్రదేశ్‌ వాసులు రతన్‌ రంజన్‌శర్మలు కలిసి ఆన్‌లైన్‌ ద్వారా డిపాజిట్‌ చేసే డబ్బుకు రెండింతలు, మూడింతలు వస్తుందని ప్రకటించారు. తొలిదశలో కొందరికి నమ్మకంగా డబ్బు చెల్లించారు. దీంతో ప్రచారం పెరిగి పలువురు ఆకర్షితులయ్యారు. క్రమంగా కొద్ది నెలల్లోనే లక్షల వ్యాపారం కోట్లకు చేరింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఇటీవల ఆన్‌లైన్‌ ఖాతాను బ్లాక్‌ చేసి పరారయ్యారు.  బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పట్టణానికి చెందిన అహ్మద్‌, సాధిక్‌, సిరాజ్‌తో సహా మొత్తం 60 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. వీరి వద్ద రూ.60 లక్షలు డిపాజిట్‌గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇంకా చాలామంది బాధితులు ఉన్నారని తెలుస్తోంది. కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని సీఐ నవీన్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని