logo

పకడ్బందీగా నర్సరీల నిర్వహణ: రాహుల్‌శర్మ

జిల్లాలో నర్సరీల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించి హరితహారానికి అవసరమైన మొక్కలను వీటినుంచే సేకరించాలని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published : 02 Dec 2022 02:24 IST

మాట్లాడుతున్న జిల్లా అదనపు పాలనాధికారి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో నర్సరీల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించి హరితహారానికి అవసరమైన మొక్కలను వీటినుంచే సేకరించాలని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో హరితహారం, నర్సరీల నిర్వహణ, గ్రామీణ క్రీడా ప్రాంగణాల పురోగతిపై మండలాల వారీగా డీఆర్‌డీఓ కృష్ణన్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో నాణ్యమైన విత్తనాలను విత్తాలని వంద శాతం మొలకెత్తాలే చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 15వ తేదీలోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. వీటి నిర్వహణకు వన సేవకులుగా మహిళలను నియమించాలని సూచించారు. ఈనెల 20వ తేదీ లోగా అన్ని గ్రామ పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాల కోసం స్థల సేకరణను పూర్తి చేయాలన్నారు.  

* ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి డైట్‌ కళాశాల వరకు జరిగిన ర్యాలీని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డైట్‌ కళాశాలలో జరిగిన సమావేశంలో విద్యార్థులకు, వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పల్వన్‌కుమార్‌, జిల్లా ఉప వైద్యాధికారి జీవరాజ్‌, అధికారులు రవీందర్‌యాదవ్‌, సాయిబాబా, లలిత, మరియా అఫ్రిన్‌, పవిత్ర, అరవింద్‌, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని