logo

‘రాష్ట్రం ఏర్పడ్డాక స్థానిక భాషా సాహిత్యానికి వెలుగు’

తెలంగాణ ఏర్పడిన తరువాత స్థానిక భాష, సాహిత్యానికి వెలుగు లభించిందని, పాఠ్యపుస్తకాల్లో స్థానిక యాసను చేరడం పెద్ద మార్పు అని మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు.

Published : 02 Dec 2022 02:24 IST

పుస్తకాన్ని ఆవిష్కరించిన అల్లం నారాయణ, జూలూరు గౌరీశంకర్‌, మామిడి హరికృష్ణ ఇతర అతిథులు

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: తెలంగాణ ఏర్పడిన తరువాత స్థానిక భాష, సాహిత్యానికి వెలుగు లభించిందని, పాఠ్యపుస్తకాల్లో స్థానిక యాసను చేరడం పెద్ద మార్పు అని మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. సాహిత్య అకాడమి కార్యాలయంలో బహుభాషావేత్త డా.నలిమెల భాస్కర్‌ రచించిన ‘తెలంగాణ భాష-ఒక అవలోకనం’ గ్రంథాన్ని గురువారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రచయిత తెలంగాణ భాషపై లోతైన అధ్యయనం చేశారని, అది భావిసాహిత్యలోకాన్ని ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. సాహిత్య అకాడమి ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ మాట్లాడుతూ... ఉద్యమ సాహిత్యంలో తెలంగాణ భాష ఎలా ఉపయోగపడిందనేది ఈ గ్రంథంలో చర్చించారన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమి కార్యదర్శి నామోజు బాలాచారి, సాహితీవేత్త కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సాహితీ విమర్శకులు కె.పి.అశోక్‌కుమార్‌, సాహిత్య విమర్శకులు డా.సంగనభట్ల నరసయ్య, తెలంగాణ విశ్వ బ్రాహ్మణ ఆత్మగౌరవ భవన ట్రస్ట్‌ కార్యదర్శి బి.సుందర్‌ ఇతరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని