logo

ఏమీ కాదనే ధీమా... రెండోసారి బైపాస్‌కు!

గుండె రక్త నాళాల్లో ఎక్కువ శాతం పూడికలుంటే.. వాటిని తొలగించేందుకు బైపాస్‌ సర్జరీ చాలా కీలకం. స్టంట్లు, మందులతో సరిదిద్దలేని పూడికలను తొలగించేందుకు ఈ సర్జరీ చేస్తారు.

Published : 02 Dec 2022 02:24 IST

తెలుగు వైద్యుడి అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: గుండె రక్త నాళాల్లో ఎక్కువ శాతం పూడికలుంటే.. వాటిని తొలగించేందుకు బైపాస్‌ సర్జరీ చాలా కీలకం. స్టంట్లు, మందులతో సరిదిద్దలేని పూడికలను తొలగించేందుకు ఈ సర్జరీ చేస్తారు. దేశవ్యాప్తంగా ఏటా 1.60లక్షల బైపాస్‌ సర్జరీలు జరుగుతుంటాయి. నగరంలో ఏటా 10-15 వేల మందికి  చేస్తున్నారు. ఒకసారి బైపాస్‌ తర్వాత చాలామంది నిర్లక్ష్యంగా ఉండటంతో మళ్లీ అవసరమవుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ఇలాంటి సర్జరీల్లో 97శాతం వరకు విజయవంతం అవుతున్నట్లు తేలింది. నగరంలోని స్టార్‌ ఆస్పత్రికి చెందిన ప్రముఖ హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్‌ లోకేశ్వరరావు సజ్జా ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనం వివరాలు ఏషియన్‌ కార్డియో వాస్క్యులర్‌, థోరాసిక్‌ అనాల్స్‌ జర్నల్‌లో తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.


2 శాతం మందిలో రెండోసారి..
-డాక్టర్‌ లోకేశ్వరరావు సజ్జా

ఒకసారి బైపాస్‌ వైద్యుల సూచనలతో అన్ని జాగ్రత్తలు పాటించాలి.  చాలామంది పొగతాగడం, రెడ్‌మీట్‌ తినడం, వ్యాయామానికి దూరంగా ఉండటం, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో లేక పదేళ్లలోనే మళ్లీ రక్తనాళాలు పూడుకుంటున్నాయి. ప్రస్తుతం 2 శాతం మందికి రెండోసారి బైపాస్‌ చికిత్సలు అవసరమవుతున్నాయి. బైపాస్‌ తర్వాత మళ్లీ ఛాతీలో నొప్పి, ఆయాసంలాంటి సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని