logo

భూములు ఇప్పిస్తామని రూ.72 కోట్లకు మోసం

రైతుల నుంచి భూములు ఇప్పిస్తామని ఓ స్థిరాస్తి సంస్థను బురిడీ కొట్టించి రూ.72 కోట్ల మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Published : 02 Dec 2022 02:24 IST

యాచారం, న్యూస్‌టుడే: రైతుల నుంచి భూములు ఇప్పిస్తామని ఓ స్థిరాస్తి సంస్థను బురిడీ కొట్టించి రూ.72 కోట్ల మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 4 రోజుల క్రితం ఆ సంస్థ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖ స్థిరాస్తి సంస్థకు హైదరాబాద్‌లో నివసించే జగన్‌ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన్ను నమ్మిన సంస్థ పెద్దఎత్తున భూములు కొనేందుకు గత మూడేళ్లలో రూ.72 కోట్లు ఇచ్చింది. ఆ మేరకు భూములను ఖరీదు చేయకపోగా రైతులకు అడ్వాన్సులు చెల్లింపుల్లోనూ భారీ వ్యత్యాసం ఉండటం, కొనుగోలు చేసిన వాటిలో వివాదాస్పద, ప్రభుత్వ భూములు ఉండటంతో కంగుతిన్న సంస్థ నిర్వాహకులు జగన్‌ను నిలదీయడంతో ముఖం చాటేశాడు. వారు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించడంతో జగన్‌ మోసాలపై ఆరా తీస్తున్నారు. తమ సంతకాలను ఫోర్జరీ చేశాడని పలువురు రైతులు చేసిన ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు అతడిపై మూడు కేసులు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని