logo

ట్రాఫిక్‌ సారథి ఎవరో?

నగర ట్రాఫిక్‌ విభాగానికి కొత్త సారథి ఎవరనేది ఆసక్తికరంగా మారింది.  నగరంలో 2020 జనవరిలో వ్యక్తిగత వాహనాలు దాదాపు 64 లక్షలుండగా.. 2022 ఆగస్టు నాటికి 77.65 లక్షలకు అంటే ఒకేసారి 18 శాతం పెరిగాయి.

Published : 02 Dec 2022 02:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగర ట్రాఫిక్‌ విభాగానికి కొత్త సారథి ఎవరనేది ఆసక్తికరంగా మారింది.  నగరంలో 2020 జనవరిలో వ్యక్తిగత వాహనాలు దాదాపు 64 లక్షలుండగా.. 2022 ఆగస్టు నాటికి 77.65 లక్షలకు అంటే ఒకేసారి 18 శాతం పెరిగాయి. అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ట్రాఫిక్‌ విభాగం సంయుక్త కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ నేతృత్వంలో ‘ఆపరేషన్‌ రోప్‌’ అక్టోబరులో ప్రారంభించారు. ఆక్రమణదారులు, ఉల్లంఘనదారులపై కొరడా ఝుళిపించారు. ఈ కార్యక్రమ ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. రంగనాథ్‌ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీ చేసినా, కొత్త సంయుక్త కమిషనర్‌ను ప్రభుత్వం ఇంకా నియమించలేదు. నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు అదనపు బాధ్యతల కింద అప్పగించారు.  

చెరగని ముద్ర:

ఏవీ రంగనాథ్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్య కొలిక్కి తెచ్చేందుకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాదచారుల కోసం పెలికాన్‌ సిగ్నళ్లు ఏర్పాటు చేయించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌, రాంగ్‌ సైడ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌ల కట్టడికి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు.  గతంలో నగర ట్రాఫిక్‌ డీసీపీగా పనిచేసిన రంగనాథ్‌ 2017లో నల్గొండ ఎస్పీగా బదిలీపై వెళ్లారు. 2021 డిసెంబరులో పదోన్నతిపై నగర ట్రాఫిక్‌ సంయుక్త కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని