logo

చిత్ర వార్తలు

కర్ణాటక హసన్‌ నుంచి వస్తున్న గ్యాస్‌ పైపులైన్‌కు పటిష్ట రక్షణ కల్పిస్తూ నిర్మిస్తున్నారు. ఎల్‌పీజీ ఎంత ఒత్తిడితో వస్తోందో పరిశీలించే కేంద్రాల చుట్టూ కంచె ఏర్పాటుచేస్తున్నారు. ఔటర్‌ రింగురోడ్డు పక్కన కోహెడ వద్ద గ్యాస్‌ కేంద్రానికి  ఇలా కంచె ఏర్పాటుచేశారు.

Updated : 02 Dec 2022 05:47 IST

వాయు క్షేత్రం.. రక్షణ ఛత్రం

కర్ణాటక హసన్‌ నుంచి వస్తున్న గ్యాస్‌ పైపులైన్‌కు పటిష్ట రక్షణ కల్పిస్తూ నిర్మిస్తున్నారు. ఎల్‌పీజీ ఎంత ఒత్తిడితో వస్తోందో పరిశీలించే కేంద్రాల చుట్టూ కంచె ఏర్పాటుచేస్తున్నారు. ఔటర్‌ రింగురోడ్డు పక్కన కోహెడ వద్ద గ్యాస్‌ కేంద్రానికి  ఇలా కంచె ఏర్పాటుచేశారు.

జీ-20 సదస్సు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాల్లో జీ-20 లోగోను ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం గోల్కొండ కోట, చార్మినార్‌ వద్ద లోగోను పురావస్తుశాఖ ప్రదర్శించింది.

న్యూస్‌టుడే, చార్మినార్‌

నిర్ణీత వేగం.. నిర్దేశిత మార్గం

బాహ్య వలయ రహదారిలో ప్రమాదాలు, ట్రాఫిక్‌ జామ్‌ను నివారించడానికి వేగాన్ని బట్టి వెళ్లాల్సిన లేన్లను కేటాయించారు. నిర్దేశిత వేగం, సంబంధిత లేన్లను సూచించే డిజిటల్‌ సూచికలను ఔటర్‌ అప్పా కూడలి చెంత ఏర్పాటుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని