logo

సాసా యాప్‌తో పాతమీటర్లకు బిల్లు

విద్యుత్తు మీటర్‌ రీడింగ్‌లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రేటర్‌ పరిధిలో ఇన్‌ఫ్రారెడ్‌ పోర్ట్‌ మీటర్‌ రీడింగ్‌ యంత్రాలను విద్యుత్తు పంపిణీ సంస్థ వినియోగిస్తుంది.

Published : 03 Dec 2022 03:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు మీటర్‌ రీడింగ్‌లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రేటర్‌ పరిధిలో ఇన్‌ఫ్రారెడ్‌ పోర్ట్‌ మీటర్‌ రీడింగ్‌ యంత్రాలను విద్యుత్తు పంపిణీ సంస్థ వినియోగిస్తుంది. ఇప్పటికీ నగరంలో 5 శాతం కనెక్షన్లకు పాత మీటర్లే ఉన్నాయి. ఇక్కడ వాస్తవ వినియోగం కంటే తక్కువ రీడింగ్‌ నమోదు చేయడం వంటి ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో డిస్కం ఖజానాకు గండిపడుతోంది. వీటిని నివారించేందుకు మీటర్లు మార్చే వరకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు చెందిన సాసా యాప్‌తో రీడింగ్‌ తీయనున్నారు. మీటర్‌ రీడింగ్‌ ఫొటో తీయగానే కాల్చిన యూనిట్ల వివరాలు నమోదవుతాయి. పక్కాగా బిల్లింగ్‌ జరుగుతుందని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు.
మీ సేవలో కొత్త కనెక్షన్‌.. కొత్త విద్యుత్తు కనెక్షన్‌కు మీసేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పేర్కొంది. యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్లో, విద్యుత్తు వినియోగదారుల సేవా కేంద్రాల్లో మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంలో కొత్త కనెక్షన్ల రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెలుసుబాటు మీ సేవ కేంద్రాల్లోనూ కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని