logo

సమన్వయంతో డ్రగ్స్‌ కట్టడికి చర్యలు

మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్‌ పోలీసులు.. మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో అడ్డుకొనేందుకు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు

Published : 03 Dec 2022 03:52 IST

సమావేశంలో మాట్లాడుతున్న సీవీ ఆనంద్‌, చిత్రంలో మహేశ్‌ భగవత్‌

ఈనాడు-హైదరాబాద్‌: మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్‌ పోలీసులు.. మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో అడ్డుకొనేందుకు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మత్తుపదార్థాల సరఫరా వ్యవస్థల్ని కట్టడి చేయడంతోపాటు.. వాటి వెనకున్న వ్యక్తుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో మరింత సమన్వయంతో పనిచేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ), జీఎస్టీ, ఎక్సైజ్‌, ఎఫ్‌ఆర్‌ఆర్‌వో, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ విభాగం అధికారులతో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ సాయి చైతన్య కుమార్‌, నేర పరిశోధన విభాగం సంయుక్త కమిషనర్‌ గజరావు భూపాల్‌, హెచ్‌న్యూ డీసీపీ చక్రవర్తి, వివిధ ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన అధికారులు పరస్పర సహకారంపై తరచూ భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని