logo

నీటి కాలుష్యమా..పైప్‌లైన్‌ కెమెరా ఉందిగా

నగరంలో కలుషితనీరు, లీకేజీలను అరికట్టేందుకు జలమండలి అధికారులు కొత్త పంథాలో వెళ్తున్నారు. తాగునీటి పైపులైన్లలోకి అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరా పంపుతున్నారు

Published : 03 Dec 2022 04:12 IST

కలుషిత జలాలను గుర్తించేందుకు కొత్త పంథా
ఈనాడు,హైదరాబాద్‌,న్యూస్‌టుడే, ముషీరాబాద్‌

పైపులైన్‌ ఇన్‌స్పెక్షన్‌ కెమెరా సిస్టం

నగరంలో కలుషితనీరు, లీకేజీలను అరికట్టేందుకు జలమండలి అధికారులు కొత్త పంథాలో వెళ్తున్నారు. తాగునీటి పైపులైన్లలోకి అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరా పంపుతున్నారు. పైపు ఇన్‌స్పెక్షన్‌ కెమెరాగా వ్యవహరిస్తున్న దీనితో లీకేజీలు, కలుషిత నీరు ఎక్కడుందో తెలుసుకొని మరమ్మతులు చేస్తున్నారు. సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటే గ్రేటర్‌ వ్యాప్తంగా ఉపయోగించనున్నట్లు తెలిపారు.

ఇలా పని చేస్తుంది..

ఈ పరికరం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది. భూగర్భంలో కెమెరా.. భూమిపైన కంప్యూటర్‌ తరహాలో మానిటర్‌ ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా కెమెరా కదలికలను నియంత్రిస్తారు.
* కలుషిత జలాలున్నాయంటే.. సమీప తాగునీటి పైపులైన్‌లోకి కెమెరా పంపుతారు. ః కెమెరా తాగునీటి పైపు లోపలికి వెళ్లేందుకు వీలుగా 120 మీటర్ల పొడవు ఉంటుంది. ఆన్‌ చేయగానే..మానిటర్‌పై నీళ్లు కనిపిస్తుంటాయి.
* లోపలున్న పైపులెన్‌ ఎంతదూరం వెళ్తుందో..తెరపై కనిపిస్తుంది. అపరిశుభ్ర నీరు, లీకేజీ, పైపులైన్‌ పగుళ్లు కనిపించగానే కెమెరా ఆపేస్తారు.
* జలమండలి అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పనులు, మరమ్మతులపై అక్కడికక్కడే నిర్ణయం తీసుకుంటారు.

రోడ్లు తవ్వడం తక్కువే  

పాతబస్తీ, నాంపల్లి, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ నియోజకవర్గాల్లో అరవై, డెబ్బైఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు ఉన్నాయి. లీకేజీలను గుర్తించేందుకు భూమిని తవ్వితే మురుగు, ఇతర పైపులైన్లు దెబ్బతింటున్నాయి. కొత్త పరికరాన్ని తాగునీటి పైపులైన్‌లోకి పంపితే ఎక్కడ లీకేజీ అవుతుందో కచ్చితంగా చెబుతుంది. అక్కడ మాత్రమే భూమిని తవ్వి గంటల్లోనే మరమ్మతులు చేసేందుకు అవకాశాలున్నాయి. పరికరం రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు వివిధ రకాల్లో లభిస్తోంది. జలమండలి అధికారులు డివిజన్‌కోటి కొంటే, నిత్యం గుంతలు తవ్వే అవసరంఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు