logo

బాధితుడికి బాసటగా నిలిచారు

ప్రమాదంలో గాయపడి గాంధీ ఆసుపత్రి వద్ద అయినవారు వస్తారని ఎదురుచూస్తున్న చంద్రమౌళికి పలువురు అండగా నిలిచారు. బతుకు దెరువుకు నగరానికి వచ్చిన చంద్రమౌళి కాలికి ప్రమాదంలో తీవ్ర గాయమైంది.

Published : 03 Dec 2022 04:12 IST

ఖర్చులకు డబ్బులిస్తున్న పూర్ణ శాంతి

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: ప్రమాదంలో గాయపడి గాంధీ ఆసుపత్రి వద్ద అయినవారు వస్తారని ఎదురుచూస్తున్న చంద్రమౌళికి పలువురు అండగా నిలిచారు. బతుకు దెరువుకు నగరానికి వచ్చిన చంద్రమౌళి కాలికి ప్రమాదంలో తీవ్ర గాయమైంది. తోడు వచ్చిన అల్లుడు గాంధీ లో చేర్పించి వెళ్లాడు. కట్టు కట్టిన సిబ్బంది ఒకరోజు ఆసుపత్రిలో ఉంచుకుని బయటకు పంపించారు. అతని దీనస్థితిపై ‘అయినవారు వస్తారని...ఇంటికి తీసుకెళ్తారని’ శీర్షికతో ఈనాడులో శుక్రవారం ప్రచురితమైన కథనానికి పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పందించారు. హెల్ఫ్‌ ఏజ్‌ ఇండియా హైదరాబాద్‌ శాఖ వారు శుక్రవారంవచ్చి కాలిబాటపైన ఉన్న చంద్రమౌళి వివరాలు తెలుసుకుని ఆసుపత్రిలో చేర్పించారు. ఇతరత్రా అవసరాలుంటే ఖర్చును భరిస్తామన్నారు. బీడీయల్‌ విన్నర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు అరికపూడి రఘు.. చౌటుప్పల్‌లోని అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో చేర్పిస్తానన్నారు. శ్రీసాయి శాంతి సహాయ సేవా సమితి అధ్యక్షురాలు డాక్టర్‌ ఎర్రం పూర్ణశాంతిగుప్తా ఆసుపత్రికి చేరుకుని కొంత నగదు అందించారు. సాయి యాదాద్రి సేవా సంస్థ అశోక్‌, ఇతర సభ్యులు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని