logo

అంతరిక్ష రంగంలో మార్పుల్ని అందిపుచ్చుకోవాలి

అంతరిక్ష రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని, అప్రమత్తంగా ఉండాలని భారత తొలి వ్యోమగామి, రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ రాకేశ్‌శర్మ సూచించారు.

Updated : 03 Dec 2022 06:37 IST

భారత తొలి వ్యోమగామి, రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ రాకేశ్‌శర్మ

రాకేశ్‌శర్మకు జ్ఞాపికను అందజేస్తున్న రియర్‌ అడ్మిరల్‌ సంజయ్‌దత్‌

కంటోన్మెంట్‌: అంతరిక్ష రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని, అప్రమత్తంగా ఉండాలని భారత తొలి వ్యోమగామి, రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ రాకేశ్‌శర్మ సూచించారు. సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌(సీడీఎం)లో శుక్రవారం స్పేస్‌ సింపోజియం నిర్వహించారు. రాకేశ్‌శర్మ ముఖ్యఅతిథిగా హాజరై.. ప్రసంగించారు. డిఫెన్స్‌ స్పేస్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌, ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ డీవీ ఖోట్‌, అడ్రిన్‌ డైరెక్టర్‌ డా.పీవీ రాధాదేవి, ధృవ స్పేస్‌ సంస్థ సీఈవో సంజయ్‌ నెక్కంటి, వేద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ డా.కిషోర్‌నాథ్‌, సీడీఎం కమాండెంట్‌ రియర్‌ అడ్మిరల్‌ సంజయ్‌దత్‌ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని