logo

రెండో దశ మెట్రో చరిత్రలో నిలిచిపోతుంది: మంత్రి తలసాని

రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన  మాట్లాడారు.

Published : 03 Dec 2022 04:25 IST

మెట్ల బావిని పరిశీలిస్తున్న మంత్రి తలసాని, అర్వింద్‌కుమార్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, పద్మారావునగర్‌: రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన  మాట్లాడారు. ఈ నెల 9న మైండ్‌స్పేస్‌ కూడలి వద్ద సీఎం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని, అనంతరం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ పోలీస్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌, ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, సాయన్న, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

5న బన్సీలాల్‌పేట మెట్ల బావి ప్రారంభం.. పునరుద్ధరించిన బన్సీలాల్‌పేట మెట్లబావిని ఈనెల 5న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. శుక్రవారం మెట్లబావి పరిసరాలను రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌తో కలిసి మంత్రి పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని