logo

‘హక్కు’ నమోదుకు ప్రత్యేక శిబిరాలు

జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది.

Published : 03 Dec 2022 04:25 IST

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌తో పాటు పోలింగ్‌ బూత్‌ల వారీగా ఈనెల 3, 4 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు కొత్త ఓటరు నమోదుకు ఫారం6, మార్పులు చేర్పులకు ఫారం 8, పేరు తొలగింపునకు ఫారం 7 అందుబాటులో ఉంటాయి. ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు తీసుకువెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై జిల్లా పాలనాధికారిణి నిఖిల బీఎల్‌ఓలకు, తహసీల్దార్లకు, ఆర్‌ఐలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.

ఇటీవలే ముసాయిదా విడుదల

అభ్యంతరాల స్వీకరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటీవల జిల్లా అధికారులు ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజక వర్గాల్లో మొత్తం 1,130 పోలింగ్‌ బూత్‌లు ఉండగా, ఓటర్లు 8,72,299 మంది ఉన్నారు. అందులో స్త్రీలు 4,34,447 మంది, పురుషులు 4,37,274 మంది, 578 మంది ఇతరులు ఉన్నారు.. ఏవైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబరు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్లు గ్రామ పంచాయతీలు, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద గల ఓటరు జాబితాలో పరిశీలించుకొని మార్పులు, చేర్పులు, తొలగింపులకు సవరణలు చేసుకోవచ్చు. దరఖాస్తులను డిసెంబరు 20వరకు పరిశీలిస్తారు.  

నిరంతర ప్రక్రియ: నిఖిల, పాలనాధికారిణి  

ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ప్రత్యేక  శిబిరాల వద్ద బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని